ఆ యాడ్ ఎంత పనిచేసింది! సెహ్వాగ్‌ను ఓ ఆట ఆడుకున్న నెటిజన్లు (వీడియో)

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంతకముందు జరిగిన 8 టీ20ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్‌కు టీమిండియాపై టీ20ల్లో ఇదే తొలి విజయం. దీంతో ట్విట్టర్‌లో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.
బంగ్లా చేతిలో టీమిండియా ఓటమికి... వీరేంద్ర సెహ్వాగ్‌కు సంబంధం ఏంటని అనుకుంటున్నారా? భారత్-బంగ్లాదేశ్ టీ20 సిరిస్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ ఓ యాడ్‌ని రూపొందించింది. ఈ యాడ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ నటించాడు. యాడ్‌లో భాగంగా సెహ్వాగ్ బంగ్లాదేశ్ ఒక్క టీ20లో కూడా భారత్‌పై విజయం సాధించలేదని ఎగతాళిగా మాట్లాడతాడు.

బంగ్లాదేశ్ ఏమి చేస్తుందని సెహ్వాగ్ ప్రశ్న!
శ్రీలంక వేదికగా జరిగిన నిదాహాస్ ట్రోఫీలో బంగ్లాదేశ్ క్రికెటర్లు చేసిన నాగిని డ్యాన్స్‌ని కూడా ప్రస్తావిస్తాడు. అంతేకాదు, టీమిండియాపై బంగ్లాదేశ్ జట్టు తొలి టీ20 మ్యాచ్ గెలిస్తే ఏమి చేస్తుంది? అని కూడా సెహ్వాగ్ ప్రశ్నిస్తాడు. సెహ్వాగ్ ఏమంటా ప్రశ్నించాడో ఏమో తెలియదు గానీ ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించింది.
సెహ్వాగ్‌పై ట్విట్టర్‌లో ట్రోల్స్
దీంతో బంగ్లా ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మరోవైపు టీమిండియాపై బంగ్లా తొలి టీ20 మ్యాచ్ గెలిస్తే ఏమి చేస్తుందని ప్రశ్నించిన సెహ్వాగ్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఓ ఆట ఆడుకున్నారు. "సెహ్వాగ్ ఇలాంటి యాడ్‌ల్లో నటించడం దయచేసి మానేయండి. మీ వల్లే టీమిండియా ఓడింది" అంటూ ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు.
నువ్వు ట్వీట్ చేయడం ఇక ఆపేయి
"హల్లో వీరేంద్ర సెహ్వాగ్ బంగ్లాదేశ్ విజయం సాధించింది... ఇప్పుడు ఏం చేస్తావ్? డ్రామా లేక ట్వీట్?" అంటూ మరొక అభిమాని ట్వీట్ చేశాడు. "వీరేంద్ర సెహ్వాగ్ బ్రో నువ్వు ట్వీట్ చేయడం ఇక ఆపేయి... బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఒక మనిషిగా మాటమీద నిలబడు" అంటూ ఓ నెటిజన్ చురకలంటించాడు.

రాజ్ కోట్ వేదికగా రెండో టీ20
మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించడంతో ఈ సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో రాజ్ కోట్ వేదికగా జరగనున్న రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలనే గట్టి పట్టుదలతో రోహిత్ సేన ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications