For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2026: చరిత్ర సృష్టించిన ఇటలీ జట్టు!

T20 World Cup 2026: టీ20 క్రికెట్ పరిచయం తర్వాత ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రజాదరణ పొందుతోంది. మూడు గంటల్లోనే మ్యాచ్ ఉత్సాహంగా ముగుస్తుంది. కాబట్టి అనేక యూరోపియన్ దేశాలు క్రికెట్ ఆడేందుకు ఆసక్తిని చూపుతున్నాయి. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీకి ఇటలీ మొదటిసారిగా అర్హత సాధించింది. దీని ద్వారా ఇప్పటివరకు క్రికెట్ వైపు చూడని యూరోపియన్ దేశాలలో ఇటలీ అర్హత సాధించడం ఒక ప్రత్యేకత.

టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం యూరోపియన్ ప్రాంతీయ క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఇటలీ, నెదర్లాండ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇటలీ నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని నెదర్లాండ్స్ జట్టు 16.2 ఓవర్లలో ఛేదించింది. దీని ద్వారా నెదర్లాండ్స్ జట్టు టీ20 ప్రపంచ కప్ టోర్నీకి నేరుగా అర్హత సాధించింది. నెదర్లాండ్స్ జట్టుపై ఇటలీ ఓడినప్పటికీ.. గ్రూప్‌లో 4 మ్యాచ్ లు ఆడిన ఇటలీ 2 విజయాలు, ఒక పరాజయం, ఒక ఫలితం తేలని మ్యాచ్‌తో 5 పాయింట్లు ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా ముందంజ వేసింది.

Italy Creates History by Qualifying for T20 World Cup 2026

పాయింట్ల పట్టికలో స్కాట్లాండ్ జట్టుతో పోలిస్తే అధిక రన్ రేట్ సాధించిన ఇటలీ జట్టు ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ టోర్నీకి అర్హత సాధించింది. ఇదిలా ఉండగా.. గత 4 టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్లలో స్థానం సంపాదించిన స్కాట్లాండ్ జట్టు ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ టోర్నీకి అర్హత సాధించకుండానే నిష్క్రమించింది. మొత్తం 20 జట్లు 2026 టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో ఆడనున్నాయి. ప్రస్తుతం వరకు 15 జట్లు అర్హత సాధించాయి. ఇంకా ఈస్ట్ ఆసియా పసిఫిక్ క్వాలిఫయర్ టోర్నమెంట్ నుంచి 3 జట్లు, ఆఫ్రికా క్వాలిఫయర్ ద్వారా రెండు జట్లు ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించనున్నాయి.

ఈ నేపథ్యంలో మాజీ ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ ఆటగాడు జో బర్న్స్ ప్రస్తుతం ఇటలీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గత టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ సమయంలో పాకిస్థాన్ అమెరికా జట్టుతో ఓడిపోయిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఇటలీ జట్టు ప్రపంచ కప్ టీ20 టోర్నమెంట్‌లో ఆడనున్నందున పాకిస్తాన్ జట్టు జాగ్రత్తగా ఉండాలని భారత అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Saturday, July 12, 2025, 11:07 [IST]
Other articles published on Jul 12, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+