Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rahul Dravid: అతడిని ఔట్ చేయాలంటే డజను ఫిరంగి కాల్పులు జరపాలి!

''సచిన్ తెందుల్కర్‌ భారత క్రికెట్‌కు దేవుడు అయితే.. సౌరభ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆఫ్‌సైడ్‌, ఆన్‌సైడ్ దేవుళ్లు! మరీ వారందరూ వరుసగా విఫలమైతే?.. అయినా టీమిండియా అభిమానుల్లో ఏ మాత్రం కలవరపాటు ఉండదు. ఎందుకంటే 'ది గ్రేట్‌ వాల్‌' క్రీజులో పాతుకుపోయి జట్టుకు వెన్నెముకగా నిలుస్తాడనే నమ్మకం''... అని ఓ అభిమాని దిగ్గజ క్రికెటర్‌ రాహుల్ ద్రవిడ్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్‌ ఇది.

ఆ అభిమాని మాటలను కాదనలేం. దానికి నిదర్శనంగా ఎన్నో మ్యాచులను గెలిపించాడు ద్రవిడ్‌. ప్రత్యర్థులు నిప్పులు చెరిగే బంతులు విసురుతున్నా వారిని నిస్సహాయులను చేస్తూ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. కవ్వించే ప్రత్యర్థులకు కూడా సౌమ్యుడిగానే ఉంటూ బ్యాటుతోనే సమాధానమిచ్చే రాహుల్ ద్రవిడ్‌ పుట్టినరోజు నేడు. 1973 జనవరి 11న ద్రవిడ్ జన్మించాడు. ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ద్రవిడ్‌ గొప్పదనం గురించి ప్రముఖులు ఏమన్నారంటే..

It would take a dozen cannon shots to knock Rahul Dravid out in field

భావితరాల క్రికెటర్లకు ద్రవిడ్‌ రోల్‌ మోడల్‌. మైదానంలో, బయటా ఎలా ఉండాలో మా అందరికి అతడో మార్గదర్శకం. అతడి బాటలోనే మేం పయనించడానికి ప్రయత్నిస్తాం - సచిన్ టెండూల్కర్‌

సచిన్‌ గొప్ప ఆటగాడిగా చెబుతుంటాం. కానీ ద్రవిడ్‌ ఇంకా అద్భుతమైన ఆటగాడు. అతడిని ఔట్‌ చెయ్యడం ఎంతో కష్టతరం. డిఫెండ్‌ చేయడంలో ద్రవిడ్‌ ఎంతో నేర్పరి. అంతేకాకుండా అతడు పొరపాట్లను తక్కువగా చేస్తాడు. దీంతో అతడిని ఔట్ చేయాలంటే తీవ్రంగా శ్రమించాల్సి వచ్చేది - షోయబ్‌ అక్తర్‌

రాహుల్‌ ద్రవిడ్‌ను బాగా ఆడారని ప్రశంసించండి. వెంటనే అతడు మరో ఆటగాడు బాగా ఆడాడని చెబుతాడు. స్వార్థం లేకుండా అలా ఎలా ఉంటారు? రాహుల్ ద్రవిడ్‌ ప్రత్యేకత ఇదే. అతడు ఎంతో సాధారణంగా ఉంటాడు - హర్షా భోగ్లే

మనం చూసే అన్ని విషయాలు దూకుడుగా అనిపించవు. అసలైన దూకుడిని మీరు చూడాలనుకుంటే ద్రవిడ్‌ కళ్లలోకి చూడండి. అతడి పరాక్రమం ఏంటో తెలుస్తుంది - మాథ్యూ హెడెన్‌

రాహుల్ ద్రవిడ్ ఎప్పుడూ సచిన్ నీడలో ఉండేవాడు. సచిన్‌ రికార్డులతో చూస్తే అతడి రికార్డులు గొప్పగానే ఉంటాయి. కానీ వారిద్దరిని పోల్చకూడదు. ఎందుకంటే ఇద్దరూ భిన్నమైన ఆటగాళ్లు. రాహుల్ పరిపూర్ణ క్రికెటర్ - ముత్తయ్య మురళీథరన్‌

రాహుల్ ద్రవిడ్‌ మనందరికి 'ది గ్రేట్‌ వాల్‌' అనే తెలుసు. కానీ అతడిని 'కంచు కోట'గా అభివర్ణించాలి. ఎందుకంటే ద్రవిడ్‌ ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే మీరు సర్వశక్తులు ఒడ్డాల్సిందే. అతడిని ఔట్‌ చేయాలంటే డజను ఫిరంగి కాల్పులకు సమానమైన బౌలింగ్‌ మీరు చేయాలి - షేన్ వార్న్‌

బ్యాటింగ్‌కు వచ్చిన తొలి 15 నిమిషాల్లోనే ద్రవిడ్‌ను ఔట్‌ చెయ్యాలి. అది కుదరకపోతే ఇతర బ్యాట్స్‌మన్‌ ఔట్‌చేయడానికి ప్రయత్నించాలి - స్టీవ్‌ వా

అతడి బ్యాగులో రెండు జతల బట్టలు సర్దుతాను. వాటితోనే తన పర్యటనలు ముగిస్తాడు. అతడు గ్యాడ్జెట్స్‌, బ్రాండెడ్‌ వస్తువులు, కార్ల గురించి పట్టించుకోడు. కానీ అతడి బ్యాటు ఒక్క గ్రాము బరువు తగ్గినా వెంటనే దాన్ని గుర్తిస్తాడు - విజేత ద్రవిడ్‌, రాహుల్ ద్రవిడ్‌ సతీమణి

నా జీవితం కోసం ఎవరైనా బ్యాటింగ్‌ చేయాలంటే.. నేను రాహుల్ ద్రవిడ్‌ను ఎంపిక చేస్తా - బ్రియన్ లారా

ద్రవిడ్‌ నా శైలిలో దూకుడుగా ఆడగలడు. కానీ ఎప్పటికీ అతడిలా గొప్పగా నేను బ్యాటింగ్‌ చేయలేను - క్రిస్ గేల్‌

రాహుల్‌ ద్రవిడ్‌ అసాధారణ వ్యక్తి. అతడి వ్యక్తిత్వం ఎంతో గొప్పది - షేన్ వాట్సన్‌

భారత క్రికెట్‌లో ద్రవిడ్‌ అత్యుత్తమ ఆటగాడు - కపిల్‌దేవ్‌

1990ల్లో ఆస్ట్రేలియా జట్టులోకి నేరుగా రావడానికి ఓ భారతీయుడికి ఎల్లప్పుడూ అవకాశం ఉండేది. అతడే రాహుల్‌ ద్రవిడ్‌. అతడో గొప్ప ఆటగాడు - గ్లెన్‌ మెక్‌గ్రాత్‌

Story first published: Thursday, January 11, 2024, 10:56 [IST]
Other articles published on Jan 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+