Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మర్యాదగా కెప్టెన్సీ నుంచి కేన్ విలియమ్సన్ తప్పుకుంటే మంచిది : న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రీ ఆడమ్స్

It would be better if Kane Williamson stepped down from the captaincy Says Andre Adams

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఆండ్రీ ఆడమ్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ జట్టు కొత్త కెప్టెన్ గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నాడు. కేన్ విలియమ్సన్‌ను తప్పించడమో లేక అతనే తప్పుకోవడమో చేసి అతను తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని కోరాడు. విలియమ్సన్ న్యూజిలాండ్ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. అయితే గత కొన్నేళ్లుగా కేన్ గాయాలతో సతమతమవుతున్నాడు. అలాగే ఇటీవల అతని ఫామ్ కూడా అంత గొప్పగా లేదు. గత కొన్ని నెలలుగా కఠినమైన పూర్ బ్యాటింగ్ ఎదుర్కొంటున్నాడు.

అందువల్ల కేన్ తన కెరీర్‌ను తిరిగి మళ్లీ పట్టాలెక్కించేందుకు ఏదైనా ఒక ఫార్మాట్‌‌కు పూర్తిగా గుడ్ బై చెప్పేస్తే మేలని ఆండ్రీ ఆడమ్స్ తెలిపాడు.'కేన్ విలియమ్సన్ ఊహించినంత మేర రన్స్ చేయట్లేదు. అతను గత 12నుంచి 18నెలలుగా బ్యాటింగ్ పరంగా కష్టకాలంలో ఉన్నాడు. ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు అతనికంటూ ఓ కుటుంబం, పిల్లలున్నారు. గత రెండు సంవత్సరాలుగా అతని జీవితంలో ప్రతిదీ మారిపోయింది. అందువల్ల అది ఎంతో కొంత బ్యాటింగ్‌పై ఎఫెక్ట్ చూపిస్తుంది.

అది కొంత మీ దృక్పథాన్ని కూడా మారుస్తుంది. అతను తిరిగి జట్టు తరఫున ఆడడం మంచిదే కానీ.. ప్రస్తుతం అతని దృక్పథం మారుతుంది. యువకుడిగా ఉన్నప్పుడు మీరు మూడు ఫార్మాట్లలో రాణించగలరు. ప్రపంచవ్యాప్తంగా పర్యటించగలరు.కానీ ఇప్పుడు కొంత టైం ఫ్యామిలీకి కేటాయించాల్సి ఉంటుంది.' అని ఆండ్రీ ఆడమ్స్ తెలిపాడు.

'నా ఉద్దేశం ప్రకారం.. న్యూజిలాండ్ జట్టుకు కొత్త కెప్టెన్‌‌ను ఎంపిక చేసి.. కేన్‌ను బ్యాటింగ్ పరంగా ఫోకస్ చేయనివ్వడం ఉత్తమం. కేన్‌ తన కెప్టెన్సీ వదులుకునే విషయంలో ఈగోకు గురికాడని నేను అనుకుంటున్నాను. అతను జట్టుకు ఏది ఉత్తమమో అదే చేస్తాడు. రాస్ టేలర్ కెప్టెన్సీని కోల్పోయిన విధానం బాలేదు. అలాంటి పరిస్థితి విలియమ్సన్‌కు రాకూడదు. రాస్ తన కెప్టెన్సీ వదులుకున్నాక బ్యాట్స్‌మెన్‌గా బాగా రాణించాడు. అది అతనికి బాగా పనిచేసింది' అని ఆడమ్స్ చెప్పాడు. ఇకపోతే విలియమ్సన్ కెప్టెన్సీ నుండి వైదొలగితే టామ్ లాథమ్‌ తదుపరి కెప్టెన్ కావచ్చని, కేన్ కెప్టెన్సీని వదులుకుంటే అతను బహుశా అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా వైదొలుగుతాడని అనుకుంటున్నా అని ఆడమ్స్ చెప్పాడు.

Story first published: Sunday, September 11, 2022, 13:19 [IST]
Other articles published on Sep 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+