Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

VIRAT KOHLI: కోహ్లికి అంత సీన్ లేదు..కాస్త లాజిక్‌గా ఆలోచించండి - లారా

స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి గురించి వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు. సచిన్ టెండూలర్క్ 100 సెంచరీల రికార్డును బద్దలుకొట్టడం అసాధ్యమని, విరాట్ కోహ్లికి కూడా అది సులభం కాదని లారా అభిప్రాయపడ్డాడు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ శతక శతకాల రికార్డుపై కోహ్లి గురించి ప్రస్తావిస్తూ లారా మాట్లాడాడు.

''ప్రస్తుతం విరాట్ కోహ్లి వయస్సు ఎంత? 35. అతడు ఇప్పటికే 80 సెంచరీలు సాధించాడు. ఇంకా అతడు 20 శతకాలు చేయాలి. అతడు ప్రతి ఏడాది అయిదు శతకాలు సాధిస్తూ సచిన్ రికార్డును అందుకోవచ్చు. దానికి నాలుగేళ్ల సమయం పడుతుంది. అప్పటికీ కోహ్లికి 39 ఏళ్లు వస్తాయి. అది చాలా కష్టం. అనుకున్నదాని కంటే ఎంతో కష్టం''

It will not be easy for Virat Kohli to reach Sachin Tendulkars record of 100 centuries

''అయితే అది ఎవరూ సాధించలేరని చెప్పలేను. కానీ, సచిన్ రికార్డును కోహ్లి అధిగమిస్తాడని ఎంతో మంది చెబుతుంటారు. అందులో చాలా మంది క్రికెటింగ్ లాజిక్ లేకుండా మాట్లాడుతుంటారు. 20 సెంచరీలు అనేది అంత ఈజీ కాదు. చాలా మంది క్రికెటర్లు తమ కెరీర్ లోనే 20 సెంచరీల మార్క్ ను అందుకోలేరు. అందుకే 100 సెంచరీల రికార్డును కోహ్లి బద్దలు కొడతాడని అనుకోవట్లేదు. వయస్సు ఎవరికీ ఆగదు'' అని లారా అన్నాడు.

35 ఏళ్ల విరాట్ కోహ్లి ఇప్పటివరకు 80 సెంచరీలు సాధించాడు. వన్డేల్లో 50, టెస్టుల్లో 29, టీ20ల్లో ఒక సెంచరీ చేశాడు. ఇటీవల కోహ్లి వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. 463 వన్డేల్లో సచిన్ 49 సెంచరీలు సాధించగా, కోహ్లి 292 వన్డేల్లో 50 శతకాలు అందుకున్నాడు.

అయితే సౌతాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లికి వన్డే, టీ20 ఫార్మాట్ కు విశ్రాంతినిచ్చారు. కోహ్లి కేవలం టెస్టుల్లోనే ఆడనున్నాడు. భవిష్యత్తులో కూడా కోహ్లి తక్కువ వన్డేలు ఆడాల్సిన పరిస్థితి వస్తే.. మూడంకెల స్కోరును ఎక్కువసార్లు అందుకోవడం కష్టతరమే.

Story first published: Thursday, December 7, 2023, 12:15 [IST]
Other articles published on Dec 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+