T20 World Cup 2022: సూపర్-12కు వెళ్లేది జింబాంబ్వేనా లేక ఐర్లాండా..

టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశ మ్యాచ్ లు శుక్రవారంతో ముగియనున్నాయి. శనివారం నుంచి సూపర్ 12 మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. సూపర్ 12 మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తలపడనుంది. ఇక ఈ రోజు ముగిసే గ్రూప్ మ్యాచ్ ల్లో ఐర్లాండ్ తో వెస్టిండీస్ పోటీ పడుతుండగా.. జింబాంబ్వే స్కాట్లాండ్ తో తలపడనుంది. జింబాంబ్వే ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడగా అందులో ఒకటి ఓడిపోగా మరో మ్యాచ్ లో విజయం సాధించింది.

ఐర్లాండ్ పై
ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో జింబాంబ్వే విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాంబ్వే 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. 175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేసింది. దీంతో జింబాంబ్వే 31 పరుగుల తేడాతో గెలుపొందింది.

వెస్టిండీస్ చేతిలో
కానీ రెండు మ్యాచ్ బౌన్స్ బ్యాక్ అయిన వెస్టిండీస్ జింబాబ్వేను మట్టి కరిపించింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. జాన్సన్ చార్లెస్ 45 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 154 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 122 పరుగులకే కుప్పకూలిపోయింది. 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. వెస్టిండీస్ బౌలర్ జోసేఫ్ నాలుగు ఓవర్లకు 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.

ఎవరు గెలచినా
ఇక గ్రూప్ విషయానికొస్తే ఇందులో వెస్టిండీస్, జింబాంబ్వే, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఉన్నాయి. ఈ నాలుగు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి రెండేసి పాయింట్లతో ఉన్నాయి. ఇవాళ జరగబోయే మ్యాచ్ ల్లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సూపర్-12కు వెళ్తుంది. ఉదయం 9:30లకు హంబర్ట్ లో వెస్టిండీస్ తో ఐర్లాండ్ తలపడనుండగా.. ఇదే స్టేడియంలో మధ్యాహ్నం 1: 30 గంటలకు జింబాబ్వేతో స్కాట్లాండ్ పోటీ పడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications