For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'విరాట్ కోహ్లీ అహం వల్లే కోచ్ పదవికి కుంబ్లే రాజీనామా'

కెప్టెన్ విరాట్ కోహ్లీ అహం వల్లే అనిల్‌ కుంబ్లే కోచ్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని టీమిండియా మాజీ కోచ్ మదన్‌ లాల్‌ వ్యాఖ్యానించాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: కెప్టెన్ విరాట్ కోహ్లీ అహం వల్లే అనిల్‌ కుంబ్లే కోచ్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని టీమిండియా మాజీ కోచ్ మదన్‌ లాల్‌ వ్యాఖ్యానించాడు. క్రికెట్ నెక్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్యూలో ఈ మొత్తం వ్యవహారంలో కోహ్లీ తీరుపై ఆతడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.

ప్రస్తుత భారత జట్టు సభ్యులంతా తామేం చెప్పినా ఎస్ బాస్ అంటూ తల ఊపే వ్యక్తులు ఉండాలని కోరుకుంటున్నారని అన్నాడు. ఆటగాళ్లు ఎప్పుడూ తమకు ఎదురు చెప్పని వాళ్లనే కోరుకుంటారని, భారత క్రికెట్లో ఈ ధోరణి ఎప్పటినుంచో ఉందని అన్నాడు.

It was Virat Kohli’s ego that won the battle, says Madan Lal on Anil Kumble stepping down as India coach

'ఈ కుర్రాళ్లు అంతే. తమని ఎప్పుడూ శభాష్‌ అంటూ ఉండే వాళ్లనే ఇష్టపడతారు. బంగర్‌ లాంటి వాళ్లు అందుకు సరిగ్గా సరిపోతారు. వాళ్లు ఎప్పుడూ క్రికెటర్ల అహాన్ని సంతృప్తి పరుస్తారు. అలాకాకుండా ఎవరైనా లోపాలను ఎత్తిచూపితే, వారు తమ పదవిని వదులుకునేందుకు సిద్ధపడాలి' అని తెలిపాడు.

'నేను టీమిండియా కోచ్‌ (1996-97)గా ఉన్నప్పుడూ ఇలాగే జరిగింది. జట్టు విజయం కోసం తపించేవాడిని. టీమిండియాను 45 శాతం గెలిపించిన రికార్డు ఉంది. కానీ వ్యక్తుల మనస్తత్వాలను సరిగా అర్థంచేసుకుని తగినట్టుగా నడుచుకునే నైపుణ్యం నాకు లేదు. అందుకే తాను వైదొలగాల్సి వచ్చింది' అని మదన్ లాల్ పేర్కొన్నాడు.

నిజానికి స్వదేశీ కోచ్‌లు కంటే విదేశీ కోచ్‌లే ఎక్కువ విజయవంతమవుతారు. ఎందుకంటే సీనియర్‌ ఆటగాళ్లను వారెప్పుడూ ప్రశ్నించరని వివరించాడు. ఇలానే జాన్ రైట్, గ్యారీ కిరెస్టన్, డంకన్ ఫ్లెచర్‌లు విజయవంతమయ్యారని తెలిపాడు. టీమిండియాకు కోచింగ్ ఇవ్వడం అంటే ఆటగాళ్ల ఇగోలను మేనేజ్ చేస్తూ ఫలితాలు రాబట్టాలని అన్నాడు. అయితే కుంబ్లేను తప్పించడంలో విరాట్ కోహ్లీ అహంకారం విజయం సాధించిందని మదన్‌లాల్ తీవ్రంగా విమర్శించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+