For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అభ్యంతరం చెప్పలేదు: పాండ్యా బ్యాటింగ్ ప్రమోషన్‌పై కోహ్లీ

By Nageshwara Rao

హైదరాబాద్: ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాను నాలుగో స్థానం క్రీజులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పాండ్యాను నాలుగో స్ధానంలో పంపాలన్న ఆలోచన టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రిదేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం అన్నాడు.

'పాండ్యాను నాలుగో స్థానంలో పంపుదామన్న ఆలోచన కోచ్ రవిశాస్త్రిదే. ఆ మొత్తం క్రెడిట్ రవిశాస్త్రికే దక్కుతుంది. హార్దిక్‌ను ముందుకు పంపాలనే యోచన మాకైతే లేదు. కాకపోతే స్పిన్నర్లను బాగా ఎటాక్ చేసే పాండ్యాను బ్యాటింగ్ ఆర్డర్‌లో మరింతపైకి తీసుకొద్దామని ఆయన అన్నాడు. అతని ఆలోచనకు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. అలా పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చి కోచ్ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడు' అని కోహ్లీ తెలిపాడు.

ఓపెనర్లు వందకు పైగా భాగస్వామ్యం

ఓపెనర్లు వందకు పైగా భాగస్వామ్యం

మరోవైపు ఓపెనర్లు రోహిత్ శర్మ- రహానే 2014 తర్వాత స్వదేశంలో వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పడాన్ని పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం తనకు ఎంత మాత్రం ఇబ్బందిగా అనిపించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా కోహ్లీ చెప్పాడు. గత ఐదారేళ్ల నుంచి పాండ్యా లాంటి ఆటగాడి కోసం ఎదురు చూస్తున్నామని కోహ్లీ అన్నాడు.

పాండ్యా ఒక స్టార్ ఆటగాడు

పాండ్యా ఒక స్టార్ ఆటగాడు

తమ జట్టులో పాండ్యా ఒక స్టార్ ఆటగాడు అనే విషయాన్ని అతను మరోసారి నిరూపించుకున్నాడని కోహ్లీ వెల్లడించాడు. ఇండోర్‌లో జరిగిన మూడో వన్డేలో ఆసీస్‌పై టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు వన్డేల సిరిస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో భారత్ కైవసం చేసుకుంది.

13 బంతులు ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి చేధించిన భారత్

13 బంతులు ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి చేధించిన భారత్

ఆసీస్ నిర్దేశించిన 294 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ఇంకో 13 బంతులు ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి వికెట్ కు 139 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన భారత్.. ఆపై ఎనిమిది పరుగుల వ్యవధిలో మరో వికెట్‌ను నష్టపోయింది. ఈ సమయంలో కోహ్లీతో కలిసిన పాండ్యా స్కోరు బోర్డును పరిగెత్తించాడు.

పాండ్యాతో కలిసి 56 పరుగుల్ని జత చేసిన కోహ్లీ

పాండ్యాతో కలిసి 56 పరుగుల్ని జత చేసిన కోహ్లీ

పాండ్యాతో కలిసి మూడో వికెట్‌కు 56 పరుగుల్ని జత చేసిన కోహ్లీ(28) అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కేదార్ జాదవ్ (2) పరుగలకే పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా టీమిండియా 206 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. పాండ్యా (78) నిలకడగా ఆడుతూ భారత్ ‌ విజయానికి చేరువ చేసి ఆ తర్వాత అవుటయ్యాడు.

మూడో వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్యా

మూడో వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్యా

ఈ క్రమంలో మనీష్ పాండేతో కలిసి 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సాధారణంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే హార్దిక్ పాండ్యాను మూడో వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌ల్లో ఆ స్థానంలో మనీష్ పాండే, కేదర్ జాదవ్‌లు విఫలం కావడంతో పాండ్యాను ప్రమోట్ చేశారు.

ఇదంతా 2019 వరల్డ్ కోసమే

ఇదంతా 2019 వరల్డ్ కోసమే

వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్ ఆర్డర్‌ను కూడా పరీక్షిస్తున్న భారత జట్టు ఆ మేరకు కొంతవరకూ సక్సెస్ అయింది. హార్దిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్‌తో టీమిండియా మూడో వన్డేలో విజయం సాధించడంతో పాటు వన్డేల్లో నెంబర్ వన్ స్ధానానికి చేరుకుంది. దీంతో పాండ్యా ప్రమోషన్‌కు కారణం కోచ్ రవిశాస్త్రియేనని కోహ్లీ చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+