Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంతా వారి వల్లే: బంగ్లా కెప్టెన్

PAK vs BAN: ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన కీలకమైన సూపర్-4 మ్యాచ్‌లో పరాజయం పాలైన తర్వాత బంగ్లాదేశ్ కెప్టెన్ జేకర్ అలీ తమ జట్టు వైఫల్యానికి కారణాలను వివరించాడు. ఈ టోర్నమెంట్‌లో తమ బ్యాటింగ్ యూనిట్ చేసిన తప్పిదాల కారణంగానే ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూశామని ఆయన స్పష్టం చేశాడూ.

"ఒక బ్యాటింగ్ యూనిట్‌గా, గత రెండు మ్యాచ్‌లను మేమే చేజార్చుకున్నాం. బౌలింగ్ యూనిట్ మాత్రం చాలా బాగా పనిచేసింది. నిన్నటి మ్యాచ్‌లో కూడా బ్యాటింగ్‌ వైఫల్యమే మాకు నష్టం కలిగించింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో నేను క్యాచ్‌లు అందుకోవడానికి ప్రయత్నించాను. కెప్టెన్సీకి తగ్గట్టుగా సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించాను" అని జేకర్ అలీ పేర్కొన్నాడు.

It was our Batting Failure Bangladesh Captain Jaker Ali on Asia Cup Elimination

బౌలర్లలో రిషాద్, ఆ తర్వాత బ్యాటింగ్‌లో సైఫ్ హసన్ బాగా ఆడారని జేకర్ అలీ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. "దురదృష్టవశాత్తూ, మేము సైఫ్‌కు బ్యాటింగ్‌లో పెద్దగా మద్దతు ఇవ్వలేకపోయాం" అని తన సహచరుల నుంచి తగిన సహకారం లభించలేదని జేకర్ అలీ అంగీకరించాడు. పాకిస్థాన్ నిర్దేశించిన 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ ఓటమితో ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్‌తో తలపడే అవకాశం పాకిస్థాన్‌కు దక్కింది. జట్టు వైఫల్యానికి బ్యాటింగే ప్రధాన కారణమని జేకర్ అలీ తేల్చి చెప్పాడు.

మ్యాచ్ పరిస్థితి ఇలా..
ఆసియా కప్ 2025లో డూ ఆర్ డైమ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్‌ను 11 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. దీంతో, ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఫైనల్‌లో పాకిస్థాన్ జట్టు భారత్‌తో తలపడనుంది. ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు టైటిల్ పోరులో ముఖాముఖి తలపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, బంగ్లాదేశ్ జట్టు 9 వికెట్ల నష్టానికి కేవలం 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. అద్భుతమైన బౌలింగ్ చేసినప్పటికీ, బంగ్లాదేశ్‌కు ఓటమి తప్పలేదు.

Story first published: Friday, September 26, 2025, 0:33 [IST]
Other articles published on Sep 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+