తప్పు నాదే!: యువరాజ్ కుక్కతో పోల్చడంపై అంగద్ బేడీ

హైదరాబాద్: తన పెళ్లి గురించి చెప్పనందుకు టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తనపై కోపంగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ తనయుడు, బాలీవుడ్ నటుడు అంగద్ బేడీ. యూవీ, అంగద్ ఇద్దరూ చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు. అయితే, ఏమైందో ఏమో తెలియదు గానీ ఇప్పుడు వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.
వివరాల్లోకి వెళితే... ఈ ఏడాది బాలీవుడ్ నటి నేహా ధూపియాను అంగద్ బేడీ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తయ్యేవరకు వీరి పెళ్లి విషయం బయటకు రానివ్వలేదు. యువీ, అంగద్ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. అలాంటిది పెళ్లి గురించి కనీసం తనకు కూడా ఒక్కమాటైనా చెప్పలేదని, ఈ విషయంలో యువీ చాలా అప్‌సెట్ అయ్యాడని అంగద్ పేర్కొన్నారు.

నేహా ధూపియాకు ఇచ్చిన ఇంటర్యూలో అంగద్ బేడీ
తనపై కోపంతో సరిగ్గా మాట్లాడటం లేదని అంగద్ తన భార్య నేహా ధూపియాకు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించాడు. నేహా ధూపియా ప్రస్తుతం బుల్లితెరపై హోస్ట్‌గా రాణిస్తోంది. నో ఫిల్టర్ నేహా కార్యక్రమం ద్వారా నేహా పలువురు సెలెబ్రిటీలని ఇంటర్వ్యూ చేస్తోంది. తాజగా నేహా ధూపియా తన భర్త అంగద్ బేడీనే ఈ కార్యక్రమం ద్వారా ఇంటర్వ్యూ చేసింది.

యువరాజ్ సింగ్ తో ఏర్పడ్డ మనస్పర్థలపై
ఈ ఇంటర్వ్యూలో తన ప్రాణస్నేహితుడైన యువరాజ్ సింగ్ తో ఏర్పడ్డ మనస్పర్థల గురించి వివరించాడు. "ఫ్రెండ్‌షిప్ డే రోజున యువీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘నా స్నేహితులనుకున్నవారితో నాకు ఎదురైన అనుభవాలను చూశాక మనుషుల కంటే నా శునకాలే మేలనిపించింది" అని పోస్ట్ చేశాడు. "ఆ పోస్ట్ చూశాక యూవీ కుక్కతో పోల్చింది నన్నే. అతడు అంతలా భాదపడడానికి కారణం నేనే" అని అంగద్ బేడీ అన్నాడు.

యువీకి నా పెళ్లి గురించి చెప్పలేదు
"తప్పంతా నాదే. నా ప్రాణ స్నేహితుడైన యువీకి నా పెళ్లి గురించి చెప్పలేదు. కానీ అనుకోకుండా పెళ్లి గురించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. యువీ నాపై కోపంగా ఉండటానికి అతనికి చాలా కారణాలు ఉండవచ్చు. నాకు యువీ అంటే ఇప్పటికీ ఇష్టమే. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇదివరకు ఉన్నట్లుగా లేదు. త్వరలో అతనికి నాపై కోపం తగ్గుతుందని అనుకుంటున్నాను" అని అంగద్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

యువరాజ్ అంటే తనకు ఎప్పటికీ ఇష్టమే
అంతేకాదు యువరాజ్ అంటే తనకు ఎప్పటికీ ఇష్టమే అని అంగద్ తెలిపాడు. "కానీ మా మధ్య ప్రస్తుతం ఫ్రెండ్‌షిప్ సరిగా లేదు. చిన్నతనంలో ప్రాణస్నేహితుల్లా మెలిగాం. ఏదో ఒకరోజు యూవీకి నాపై కోపం తగ్గుతుందని అనుకుంటున్నా" నేహా ధూపియా చేసిన ఈ ఇంటర్వ్యూ పూర్తి ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications