Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్‌ టెండూల్కర్‌ను చూసినట్టే ఉంది: స్మిత్ షాట్లపై ఆసీస్ కోచ్

It was like watching Sachin Tendulkar bat: Justin Langer on Steve Smith

హైదరాబాద్: స్టీవ్ స్మిత్ బ్యాటింగ్‌ చూస్తుంటే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గుర్తుకు వస్తున్నాడని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. బాల్ టాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన స్టీవ్ స్మిత్ ఐపీఎల్‌లో తన పునరాగమనాన్ని ఘనంగానే చాటాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఐపీఎల్ 12వ సీజన్‌లో మొత్తం 12 మ్యాచ్‌లాడిన స్టీవ్ స్మిత్ 319 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 73 నాటౌట్. ఆ తర్వాత వరల్డ్‌కప్ సన్నహాకాల్లో భాగంగా ఇంగ్లాండ్‌కు పయనం కావడానికి ముందు న్యూజిలాండ్ ఎలెవన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ల్లో స్టీవ్ స్మిత్ 89, 91 పరుగులతో ఫామ్‌లోకి వచ్చాడు.

ఇంగ్లాండ్‌కు చేరుకున్న ఆసీస్

ఇంగ్లాండ్‌కు చేరుకున్న ఆసీస్

ఇంగ్లాండ్‌కు చేరుకున్న ఆస్ట్రేలియా జట్టు తొలి ట్రైనింగ్ సెషన్‌లో స్టీవ్ స్మిత్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ని తలపిస్తున్నాడని ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. ట్రైనింగ్ సెషన్‌లో నాథన్ కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ ఆడిన షాట్లు అచ్చం సచిన్ టెండూల్కరే బ్యాటింగ్ చేసినట్లే ఉందని క్రికెట్.కామ్.ఏయూతో అన్నాడు.

లాంగర్ మాట్లాడుతూ

లాంగర్ మాట్లాడుతూ

లాంగర్ మాట్లాడుతూ "న్యూజిలాండ్‌తో జరిగిన మూడు ప్రాక్టీస్ గేమ్స్‌లో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్‌ను చూశాను. చెప్పాలంటే మాస్టర్ ఆఫ్ ద గేమ్‌ను తలపించాడు. అతడిని తిరిగి జట్టులో చూడటం చాలా సంతోషంగా ఉంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. లంచ్ రూమ్, బస్‌లో కార్డులు ఆడుతున్న సమయంలో కూడా అతడి దృష్టంతా బ్యాటింగ్ పైనే ఉంది" అని చెప్పాడు.

బ్యాటింగ్‌ను ప్రేమిస్తున్నాడు

బ్యాటింగ్‌ను ప్రేమిస్తున్నాడు

"బ్యాటింగ్‌ను అతడు అంతలా ప్రేమిస్తున్నాడు. ఇసులో తన నీడను చూసుకుంటూ.... స్నానం చేసేటప్పుడు షవర్ కింద తన నీడను చూసుకుంటూ బ్యాటింగ్ చేస్తున్నాడు. నేను జోక్ చేయడం లేదు" అని జస్టిన్ లాంగర్ తెలిపాడు. బాల్ టాంపరింగ్ నిషేధం తర్వాత వార్నర్, స్మిత్ ఆడుతోన్న తొలి అంతర్జాతీయ టోర్నీ ఇది. దీంతో ఈ ఇద్దరిపై ఆసీస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

వరల్డ్‌కప్‌లో ఆడే ఆస్ట్రేలియా జట్టిదే

వరల్డ్‌కప్‌లో ఆడే ఆస్ట్రేలియా జట్టిదే

ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, షాన్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోనిస్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, రిచర్డ్‌సన్, నాథన్ కౌల్టర్ నైల్, జాసన్ బహ్రెండార్ఫ్, నాథన్ లైన్, ఆడమ్ జంపా.

Story first published: Monday, May 20, 2019, 15:27 [IST]
Other articles published on May 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+