Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కన్నీళ్లు వచ్చాయి, 'డాడీస్‌ ఆర్మీ' అని వెక్కిరించారు: సీఎస్‌కేతో అనుబంధంపై ధోని

Sheffield Shield: Will Pucovski's Unlucky Dismissal On 82 | Oneindia Telugu
It was like an arranged marriage with CSK: MS Dhoni on Roar of The Lion

హైదరాబాద్: భారత్‌కు రెండు వరల్డ్‌కప్‌లను అందించిన ఏకైక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒకానొక సందర్భంలో కన్నీరు పెట్టుకున్నాడు. ఇంతకీ ధోని ఎప్పుడు కన్నీరు పెట్టుకున్నాడని అనుకుంటున్నారా? నిషేధం అనంతరం ఐపీఎల్ 2018 సీజన్‌లో చెన్నై జట్టు పునరాగమనం చేసిన సందర్భంలో తన నోటి నుంచి మాటలు రాలేదని, తన కళ్లలో నీరు వచ్చిందని ధోని స్వయంగా వెల్లడించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై హాట్‌ స్టార్‌ ఐదు ఎపిసోడ్ల 'రోర్‌ ఆఫ్‌ ద లయన్‌' పేరిట ఓ డాక్యుమెంటరీని బుధవారం విడుదల చేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై

కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ధోని మాట్లాడాడు. 'తిరుంబి వందుతేను సొల్లు' అనే టాగ్‌లైన్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ పునరాగమనం చేసిందని ధోనీ వెల్లడించాడు. 'తిరుంబి వందుతేను సొల్లు' అంటే 'తిరిగొచ్చామని వాళ్లకు చెప్పండి' అని అర్థం. 2013 తన కెరీర్‌లో చీకటి అధ్యాయమని ధోని తెలిపాడు.

మరీ కఠినంగా శిక్ష

మరీ కఠినంగా శిక్ష

అయితే, స్పాట్‌ ఫిక్సింగ్‌కు కారకుడైన గురునాథ్‌ మెయప్పన్‌ ఫ్రాంచైజీ యజమాని కాదని, శ్రీనివాసన్‌ అల్లుడు మాత్రమేనని ధోనీ వివరించాడు. జట్టుకు శిక్ష అవసరమే కానీ దాని ప్రభావం మరీ కఠినంగా ఉందని ధోనీ అభిప్రాయపడ్డాడు. ఇక, చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుతో తన అనుబంధం పెద్దలు కుదిర్చిన వివాహం లాంటిదని మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు.

ఫ్రాంఛైజీయే తనను ఏరి కోరి జట్టులోకి

ఫ్రాంఛైజీయే తనను ఏరి కోరి జట్టులోకి

తానేమీ ఆ జట్టు కావాలని కోరుకోలేదని, ఫ్రాంఛైజీయే తనను ఏరి కోరి జట్టులోకి తీసుకుని నాయకత్వ బాధ్యతలను అప్పగించిందని అన్నాడు. ఆ క్షణం నుంచే తనకు చెన్నైతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, ఎల్లవేళలా అభిమానులు తమకు అండగా నిలిచారని చెప్పాడు. రెండు సంవత్సరాల నిషేధం తమకన్నా అభిమానులనే అధికంగా కలచివేసిందని ధోని అన్నాడు.

చెన్నై అభిమానులు ఐపీఎల్‌ మ్యాచ్‌‌లనే చూడలేదు

చెన్నై అభిమానులు ఐపీఎల్‌ మ్యాచ్‌‌లనే చూడలేదు

చెన్నై అభిమానుల్లో ఎంతో మంది ఈ రెండు సంవత్సరాలూ ఐపీఎల్‌ మ్యాచ్‌‌లనే చూడలేదని ధోని చెప్పుకొచ్చాడు. 2018లో పునరాగమనం చేసిన సీఎస్‌కేని అందరూ 'డాడీస్‌ ఆర్మీ' అని వెక్కిరించారని. అందుకు కారణం ఆటగాళ్ల సగటు వయసు 33-34 ఏళ్ల మధ్య ఉండటమేనని ధోని తెలిపాడు. 2018లో మూడోసారి ఐపిఎల్ టైటిల్ కైవసం చేసుకోవడానికి ప్రధాన కారణం అభిమానులేనని ధోని చెప్పాడు.

అభిమానుల కోసమే టైటిల్ సాధించాం

అభిమానులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే టైటిల్ సాధించామని ధోనీ ఈ సందర్భంగా వెల్లడించాడు. ఇదిలా ఉంటే, ‘రోర్‌ ఆఫ్‌ ద లయన్‌' డాక్యుమెంటరీలో ధోనితో పాటు చెన్నై ఆటగాళ్లు సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, షేన్ వాట్సన్, మోహిత్ శర్మ, కోచ్‌లు మాథ్యూ హెడెన్, మైకేల్ హస్సీ కనిపించారు.

Story first published: Thursday, March 21, 2019, 17:39 [IST]
Other articles published on Mar 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+