Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ నాకు మధ్య జరిగిన సీక్రెట్ ఇప్పటివరకు ఎవ్వరికీ తెలీదు: గంగూలీ

It was hard to down MS Dhoni's offer for 2nd time, Sourav Ganguly opens up on MSD's great 'captaincy' gesture

హైదరాబాద్: భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్వరలో ఆయన ఆత్మకథని పుస్తకంగా విడుదల చేయనున్నారు. పదిహేడు అధ్యాయాలతో ఉన్న ఈ పుస్తకం ' 'ఎ సెంచరీ ఈజ్‌ నాట్‌ ఇనఫ్‌'' పేరుతో మైండ్ గేమ్స్ నేపథ్యంగా త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందులో దాదా తన వ్యక్తిగత, టీం ఇండియాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పనున్నారు.

అయితే ఇందులో కెప్టెన్‌ కూల్ ఎంఎస్ ధోని గురించి సౌరవ్ ఎవ్వరికీ తెలియని ఓ విషయాన్ని పేర్కొన్నారు. గంగూలీ తర్వాత టీం ఇండియాకు కెప్టెన్‌గా ధోని బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ అనంతరం సౌరవ్ తన రిటైర్‌మెంట్ ప్రకటించారు. అయితే మ్యాచ్‌లో ధోని సౌరవ్‌ని వీడ్కోలు మ్యాచ్ అన్నట్లు చివరిసారిగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టమని కోరాడంటా.

దానికి మొదట నిరాకరించిన సౌరవ్ ఆ తర్వాత ఒప్పుకున్నారు. కానీ ఈ విషయం ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. ''మ్యాచ్ ముగింపుకి వచ్చిన సమయంలో ధోని నా వద్దకు వచ్చి నన్ను కెప్టెన్సీ చేయమన్నాడు. మొదలు అందుకు నేను అంగీకరించలేదు. కానీ రెండోసారి కూడా అడగడంతో కాదనలేకపోయా'' అని దాదా పేర్కొన్నారు.

అయితే సరిగ్గా ఆరోజుకి ఎనిమిదేళ్ల క్రితం సౌరవ్ తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడం మరో విశేషం. 2000లో సచిన్ టెండూల్కర్ పలు కారణాలతో కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో దాదాన్ కెప్టెన్ అయ్యారు. ''హాస్యాస్పదంగా కెప్టెన్సీ కెరీర్‌ కూడా ఎనిమిదేళ్ల క్రితం సరిగ్గా అదే రోజు ప్రారంభం అయింది. ఆ రోజు నుంచే నేను బౌలింగ్‌, ఫీల్డింగ్ మార్చడం చేయడం ప్రారంభించా. కానీ ధోని అడిగిన రోజున నాకు చాలా కష్టంగా అనిపించింది. అందుకే మూడు ఓవర్ల తర్వాత మళ్లీ ధోనికి బాధ్యతలు అప్పగించా'' అని సౌరవ్ తెలిపారు.

తన చివరి టెస్ట్‌లో వీడ్కోలుగా ధోనీ తీసుకున్న ఆ నిర్ణయాన్ని తాను ఎప్పటికీ మరువలేనని దాదా ప్రత్యేకంగా చెప్పారు. ధోనీలోని ప్రత్యేక గుణానికి ఇది నిదర్శనమని కొనియాడారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 5, 2018, 17:27 [IST]
Other articles published on Feb 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+