హైదరాబాద్: సచిన్ టెండూల్కర్... ప్రపంచ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని విధంగా 100 సెంచరీల రికార్డుని తన ఖాతాలో వేసుకున్న సచిన్ చదువులో మాత్రం ఆశించిన విధంగా రాణించలేకపోయాడు. ఈ విషయాన్ని సచినే స్వయంగా అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
తాజాగా సచిన్ టెండూల్కర్ తన చిన్నతనంలో చదువుకుంటున్నప్పుడు దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంటూ 'ఈ ఫీల్డ్‌లో నేను ఎప్పుడూ మంచి స్కోరు చేయలేదు' అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 16 ఏళ్ల వయసులోనే సచిన్‌కు టీమిండియా నుంచి పిలుపొచ్చిన సంగతి తెలిసిందే.
1973లో జన్మించిన సచిన్ నవంబరు 15, 1989లో భారత్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. అనతికాలంలోనే సెంచరీల మోత మోగించిన సచిన్ క్రికెట్ దేవుడిగా ప్రశంసలు అందుకున్నాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సచిన్ 24 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్లో 200 టెస్టులాడి 51 సెంచరీలు, 463 వన్డేలాడి 49 సెంచరీలు నమోదు చేశాడు.