Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిరీస్ రద్దవ్వడం దురదృష్టకరం.. కానీ ఇదే సరైన నిర్ణయం: సచిన్

It’s unfortunate but right: Sachin Tendulkar after Road Safety World Series called off due to coronavirus

ముంబై: భారత్‌లో మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) రోజురోజుకు విస్తరిస్తుండటంతో 'రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌'ను తాత్కాలికంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. సిరీస్‌ రద్దు కావడంతో క్రికెట్ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్, బ్రయాన్‌ లారాలు నిరాశ చెందారు. అయితే ఆటగాళ్లు, ప్రేక్షకుల క్షేమం కోసం ఇదే సరైన నిర్ణయమని వారు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ అదుపులోకి రావాలని మేమంతా ప్రార్థిస్తున్నాం అని సచిన్ తెలిపారు.

ఇదే సరైన నిర్ణయం:

ఇదే సరైన నిర్ణయం:

'రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్న వరల్డ్‌ సిరీస్ రద్దవ్వడం దురదృష్టకరం. ఆటగాళ్లు, ప్రేక్షకుల క్షేమం కోసం తీసుకున్న ఈ నిర్ణయం సరైంది. కరోనా వైరస్‌ అదుపులోకి రావాలని మేమంతా ప్రార్థిస్తున్నాం. అందరూ కరోనా వైరస్‌ పట్ల అవగాహన కలిగి ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకోండి' అని అని సచిన్‌ పేర్కొన్నారు.

నిరాశ కలిగించింది:

నిరాశ కలిగించింది:

'ప్రస్తుత పరిస్థితి నిరాశ కలిగించింది. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లను ఆడాలని ఎదురుచూస్తున్నాం. ప్రజలు క్రికెట్‌ కోసం ఎంతో నిరీక్షిస్తున్నారు. వీరేంద్ర సెహ్వాగ్‌, సచిన్‌ వంటి లెజెండ్స్‌ ఆటను చూడాలని వారు కోరుకుంటున్నారు. ఈ టోర్నమెంట్ ఎంతో అద్భుతంగా ఉంది. ఊహించిన దాని కంటే పోటీ ఎక్కువగా ఉంది. సచిన్‌ తిరిగి మైదానంలోకి రావడం, అతడి ఆటను ప్రజలు ఆస్వాదించడం ఎంతో బాగుంది' అని లారా అన్నారు.

సిరీస్‌ రద్దు కాస్త బాధించింది:

సిరీస్‌ రద్దు కాస్త బాధించింది:

శ్రీలంక మాజీ క్రికెటర్ రోమేష్ కలువితరణ కూడా సిరీస్ రద్దుపై స్పందించారు. 'సిరీస్‌ను రద్దు చేయడం కాస్త బాధ కలిగించింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి నిర్వాహకులు సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరల్డ్‌ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లు ఆడటానికి ఎదురుచూస్తున్నా. సిరీస్ బాగా జరిగింది. చాలా రోజుల తర్వాత గొప్ప ఆటగాళ్లను కలుసుకున్నా. కరోనా అదుపులోకి రావాలని కోరుకుంటున్నా' అని చెప్పుకొచ్చారు.

కరోనా పంజా విసురుతుండడంతో:

కరోనా పంజా విసురుతుండడంతో:

రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు నిధుల సేకరణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం వరల్డ్‌ సిరీస్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి వరల్డ్‌ సిరీస్‌ను నిర్వాహకులు రద్దు చేసారు. మొదట పుణెలోని ఎంసీఏ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌లను ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియానికి తరలించారు. కానీ.. కరోనా పంజా విసురుతుండడంతో అన్ని మ్యాచ్‌లు రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ టోర్నీలో భారత్‌తో పాటు శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ జట్లు ఆడుతున్నాయి.

Story first published: Friday, March 13, 2020, 19:57 [IST]
Other articles published on Mar 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+