Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదే తగిన సమయం: సఫారీలకు సవాల్ విసిరిన పాండ్యా

 It’s time to rock in Cape Town, says Hardik Pandya as Team India arrive for 3rd ODI

హైదరాబాద్: ఆరు వన్డేల సిరిస్‌లో ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలై తీవర్ ఒత్తిడిలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకి టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సవాల్ విసిరాడు. సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య కేప్ టౌన్ వేదికగా మూడో వన్డే జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో టీమిండియా కేప్‌‌టౌన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా తీసుకున్న ఓ సెల్ఫీని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన పాండ్యా 'ఇప్పుడే దిగాం. కేప్‌టౌన్‌లో సత్తా చాటేందుకు ఇదే తగిన సమయం' అని కామెంట్ పెట్టాడు. పాండ్యా సెల్ఫీలో కేదార్ జాదవ్, శార్ధూల్ ఠాకూర్, అక్షర్ పటేల్‌లు ఉన్నారు.

సుదీర్ఘమైన సఫారీ పర్యటనను టీమిండియా కేప్ టౌన్ టెస్టుతోనే ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ తొలి టెస్టులో భారత్ టాపార్డర్ పూర్తిగా విఫమైనప్పటికీ పాండ్యా మాత్రం (93: 95 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సు)తో రాణించి తొలి ఇన్నింగ్స్‌లో జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు చేయడంతో సహాయపడ్డాడు.

అయినా సరే ఈ టెస్టులో భారత్ 72 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఆ సెంచూరియన్ వేదిగగా జరిగిన రెండో టెస్టులో కూడా ఓటమి పాలుకాడం... జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో కోహ్లీసేన 63 పరుగుల తేడాతో విజయం సాధించడంతో టెస్టు సిరిస్‌ను 1-2తో చేజార్చుకుంది.

ఆ తర్వాత ప్రారంభమైన ఆరు వన్డేల సిరిస్‌లో మాత్రం కోహ్లీసేన వరుస విజయాలు సాధిస్తోంది. రెండో వన్డేలో సఫారీలను 118 పరుగులకే కుప్పకూల్చిన తీరుపై కోహ్లీసేనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికా నమోదు చేసిన అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం.

మరోవైపు స్టార్ ఆటగాళ్లు డుప్లెసిస్, ఏబీ డివిలియర్స్, డికాక్ జట్టుకి దూరమవడంతో ఆ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం ఇరు జట్ల మధ్య కేప్ టౌన వేదికగా మూడో వన్డే జరగనున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే తగిన సమయమని కోహ్లీసేన భావిస్తోంది.

విరాట్ కోహ్లీ

తదుపరి మ్యాచ్ కోసం కేప్ టౌన్‌కు వెళుతూ విమానంలో సెల్ఫీ దిగిన విరాట్ కోహ్లీ.

జస్ప్రీత్ బుమ్రా

కేప్ టౌన్‌కు వెళ్లే క్రమంలో విమానంలో పక్కపక్క సీట్లలో కూర్చున్న పేసర్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.

కేప్‌టౌన్‌లో పాండ్యా సెల్ఫీ

కేప్ టౌన్ చేరుకున్న అనంతరం జట్టులోని సహచర ఆటగాళ్లతో పాండ్యా సెల్ఫీ.

చాహల్‌తో రోహిత్ శర్మ

మూడో వన్డే కోసం నెట్ ప్రాక్టీస్ సమయంలో చాహల్‌తో రోహిత్ శర్మ.

Story first published: Tuesday, February 6, 2018, 14:17 [IST]
Other articles published on Feb 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+