Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మన దిగ్గజం, మర్చిపోవద్దు: పోస్టర్ షేర్ చేసిన కోహ్లీ

న్యూఢిల్లీ: క్రికెట్‌లో దిగ్గజం ఒక్కరేనని అది సచిన్ టెండూల్కర్ మాత్రమేనని టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్, టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. 'సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్' టీజర్ విడుదలకు ఒక రోజు ముందుగానే చిత్రానికి సంబంధించిన రెండో పోస్టర్‌ను విరాట్ కోహ్లీ బుధవారం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.

ఆ పోస్టర్‌లో సచిన్ టెండూల్కర్ చిన్నతనంలో బ్యాటుతో దిగిన ఫొటో ఉంటుంది. ఇది దిగ్గజాన్ని గుర్తు చేస్తోందని వ్యాఖ్యానించాడు. అంతేగాక, గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ చిత్రం టీజర్ విడుదల చూడటం ఎవరూ మర్చిపోవద్దని కోరాడు.

It's time to relive our legend, one and only Sachin: Virat Kohli on Tendulkar documentary

కాగా, సచిన్ టెండూల్కర్ క్రికెట్ జీవిత చరిత్రను 'సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్' పేరుతో జేమ్స్ ఎర్సికిన్ తెరకెక్కించారు. రవి భగ్చంద్క, కార్నివాల్ మోషన్ పిక్చర్స్ నిర్మాతలుగా వ్యవహరించారు.

ఏప్రిల్ 11న చిత్రానికి సంబంధించిన తొలి పోస్టర్ విడులైంది. '55 రోజుల శిక్షణ. ఒక జంట ప్యాంట్లు. ది సచిన్ స్టోరీ' అనే క్యాప్షన్‌తో విడుదల చేశారు. సచిన్ పై సినిమా కావడంతో భారీ అంచాలున్నాయి. సచిన్ చిత్ర పోస్టర్లు విడుదల కావడంపై భారత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో కృతజ్ఞతలు తెలిపారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+