పాక్ నిజ స్వరూపం బయటపడింది: కనేరియా ఉదంతంపై నిప్పులు చెరిగిన గంభీర్

హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా పట్ల వ్యవహరించిన తీరు... ఆ దేశ నిజ స్వరూపం బయటపడిందని టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. డానిష్ కనేరియాపై వివక్ష చూపారన్న మాజీ పేసర్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యలపై శుక్రవారం గౌతమ్ గంభీర్ స్పందించాడు.
షోయబ్ క్రికెట్ ఆడే రోజుల్లో మతం, కులం, ప్రాంతం ఆధారంగా వివక్ష ఎక్కువగా కనబడేదని అక్తర్ చెప్పిన విషయాన్ని గౌతమ్ గంభీర్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. "కనేరియా హిందూ అనే కారణంతో తీవ్రంగా అవమానించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న దేశంలో ఇలాంటి వివక్షకు గురవ్వడం శోచనీయం" అని అన్నాడు.

అజహరుద్దీన్ మా జట్టుకు కెప్టెన్‌గా
"మహ్మద్ అజహరుద్దీన్ మా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అతను 80-90 టెస్టులకు కెప్టెన్‌గా కొనసాగారు. దీనిని బట్టి పాక్ అసలు స్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో మహమ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, మునాఫ్ పటేల్ లాంటి క్రికెటర్లకు గౌరవం ఇచ్చింది. మునాఫ్ పటేల్ తనకు అత్యంత సన్నిహితుడు, దేశం గర్వించేలా మేమందరం ఒకే జట్టుగా ఆడాం" అని గంభీర్ అన్నాడు.

ఒక క్రికెటర్‌కే ఇలాంటి వివక్ష
"ఒక క్రికెటర్‌కే ఇలాంటి వివక్ష ఎదురైతే పాక్‌లో నివసిస్తున్న హిందువులు, సిక్కులు ఇతర మైనారిటీలు ఏ విధమైన వివక్షకు గురవుతారో అర్థం చేసుకోవచ్చు. పాకిస్థాన్‌లో ఇలాంటి వార్తలు రావడం దురదృష్టకరం" అని గంభీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన మామ అనిల్ దల్పాత్ తర్వాత పాకిస్థాన్ జట్టు తరపున ఆడిన రెండో హిందువుగా కనేరియా నిలిచాడు.
పాక్ తరుపున 61 టెస్టులు ఆడి 261 వికెట్లు
పాక్ తరుపున 61 టెస్టులు ఆడి 261 వికెట్లు తీయడంతో పాటు 18 వన్డేలకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. కనేరియా హిందువు కాబట్టి కొందరు క్రికెటర్లు అతడితో కలిసి భోజనం కూడా చేసే వాళ్లు కాదని షోయబ్ అక్తర్ తెలిపాడు. ఈ వీడియో గురువారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు స్పందిస్తున్నారు.

తన జీవితం సాఫీగా సాగడం లేదని
మరోవైపు తన జీవితం సాఫీగా సాగడం లేదని ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తనకు సాయం చేయాలని కనేరియా కోరాడు. "నా జీవితం మంచి స్థితిలో లేదు. నా సమస్యలను పరిష్కరించడానికి నేను పాక్‌తో పాటు ఇతర దేశాల్లోని చాలామందిని కలిశాను. నాకు ఎటువంటి సహాయం రాలేదు. చాలామంది పాక్ క్రికెటర్ల సమస్యలు పరిష్కారమైనా ఇప్పటికీ నాకే సాయం అందలేదు" అని కనేరియా ఆవేదన చెందాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications