For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'క్రిస్ గేల్ లాంటి సీనియర్ ప్లేయర్లు సిగ్గుపడాలి'

 Its shame top players are not interested in playing for West Indies: Carl Hooper

హైదరాబాద్: వెస్టిండీస్ భారత పర్యటన చేపట్టినప్పటి నుంచి ఒక్క సిరీస్‌లోనూ విజయం దక్కించుకోలేదు. విండీస్ ఆటగాళ్లు అప్పుడప్పుడు మెరిసినా మొత్తంగా రాబట్టలేకపోతున్నారు. పర్యటన మొదలైన నాటి నుంచి భారత్‌పై గెలిచింది కేవలం ఒక్క మ్యాచ్‌లోనే. ఇదే పంథాను టీ20ల్లోనూ కొనసాగిస్తోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన తొలి టీ20లో బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన ఆ జట్టు భారత్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

సీనియర్ క్రికెటర్లు సిరీస్‌కి దూరంగా ఉండటంతో

సీనియర్ క్రికెటర్లు సిరీస్‌కి దూరంగా ఉండటంతో

ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ అయిన సీనియర్ క్రికెటర్లు క్రిస్‌గేల్, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్‌ ఈ టీ20 సిరీస్‌కి దూరంగా ఉండటంతో యువ క్రికెటర్లు ఒత్తిడిలో రాణించలేకపోతున్నారు. వ్యక్తిగత కారణాలతో తాము భారత్ పర్యటనకి వెళ్లలేమని క్రిస్‌గేల్, నరైన్ స్పష్టం చేయగా.. ఆండ్రీ రసెల్ గాయంతో దూరమయ్యాడు. ఇక మిగిలిన మరో సీనియర్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో వారం క్రితం ఏకంగా అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు.

వెస్టిండీస్ తరఫున ఆడాలనే శ్రద్ధే లేదంటూ

వెస్టిండీస్ తరఫున ఆడాలనే శ్రద్ధే లేదంటూ

వెస్టిండీస్‌ జట్టు భారత్‌తో వన్డే సిరీస్ ఆడే సమయంలో క్రిస్‌గేల్ అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. మూడేళ్లుగా వెస్టిండీస్ బోర్డు, సీనియర్ క్రికెటర్ల మధ్య జీతాల విషయమై విభేదాలు కొనసాగుతుండటంతో.. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు వారు ఆసక్తి కనబర్చడం లేదు. ఈ క్రమంలో సీనియర్ క్రికెటర్లకి అసలు వెస్టిండీస్ తరఫున ఆడాలనే శ్రద్ధే లేదంటూ మాజీ కెప్టెన్ కార్ల్ హూపర్ తాజాగా ధ్వజమెత్తాడు.

సీనియర్ క్రికెటర్లు సిగ్గుపడాలి

సీనియర్ క్రికెటర్లు సిగ్గుపడాలి

‘వెస్టిండీస్ తరఫున ఆడాలనే ఉద్దేశమే వారికి లేదు. కొద్దిరోజులుగా వారు వ్యవహరిస్తున్న తీరుతోనే అది స్పష్టమవుతోంది. దానికి వారు సిగ్గుపడాలి. సీనియర్లు జట్టులో లేకపోవడంతో టీ20ల్లో వెస్టిండీస్‌ని ఓడించడం భారత్‌కి చాలా సులువు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లకి అనుభవం తక్కువ.. వారు కుదురుకునేందుకు కొంత సమయం పడుతుంది. కుర్రాళ్లలో ప్రతిభ ఉంది.. కానీ.. నిలకడగా మాత్రం రాణించలేకపోతున్నారు' అని కార్ల్ హూపర్ వెల్లడించాడు.

తడబడి ఓడిపోయినా.. దినేశ్ కార్తీక్ కష్టంతో

తడబడి ఓడిపోయినా.. దినేశ్ కార్తీక్ కష్టంతో

టీమిండియా తొలి టీ20లో స్వల్ప లక్ష్యాన్ని చేధించి శుభారంభాన్ని నమోదు చేసుకుంది. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు ఆరంభంలోనే తడబడి ఓడిపోయినా.. దినేశ్ కార్తీక్ కష్టంతో టీమిండియా ఎట్టకేలకు గట్టెక్కింది. భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ మంగళవారం రాత్రి 7 గంటల నుంచి లక్నో వేదికగా జరగనుంది.

Story first published: Tuesday, November 6, 2018, 10:46 [IST]
Other articles published on Nov 6, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+