Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుంబ్లే నిష్క్రమణ: కోహ్లీ తెలిసే ఈ తప్పు చేశాడా? (ఫోటోలు)

హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేయడంతో తన పంతం నెగ్గిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ తెగ సంతోషపడి ఉండొచ్చు. కుంబ్లే రాజీనామాతో తానే గెలిచానని తన సన్నిహితుల వద్ద చెప్పుకోవచ్చు. కానీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ చాలా పెద్ద తప్పు చేశాడని క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు.

అతని మాటలు విని కుంబ్లే పట్ల బీసీసీఐ కూడా అవమానకరంగా ప్రవర్తించింది. నిజం చెప్పాలంటే కోచ్ ఎంపిక విషయంలో కీలకపాత్ర పోషించిన క్రికెట్ సలహా కమిటీ కూడా విఫలమైంది. విరాట్ కోహ్లీ ఈరోజు గొప్ప బ్యాట్స్ మెన్ కావొచ్చు. కానీ కెప్టెన్సీలో ఇప్పుడిప్పుడే అతడు బుడిబుడి అడుగులు వేస్తున్నాడన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

కోచ్‌గా కుంబ్లే లాంటి పోరాట యోధుడి సేవలు కోల్పోవడం వల్ల కోహ్లీకి నష్టం లేకపోవచ్చు గానీ, జట్టుకు మాత్ర ఇది కచ్చితంగా నష్టం కలిగించేదే. ఆటగాళ్లు పట్ల కఠినంగా ఉంటున్నాడనే ఒక్క కారణం చేత అంతర్జాతీయ క్రికెట్‌లో 17 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ లెజెండరీ క్రికెటర్‌ను అవ‌మాన‌క‌ర రీతిలో సాగ‌నంపారు.

కోచ్‌గా అనిల్ కుంబ్లే ఉన్నది ఏడాది కాలమే అయినప్పటికీ, ఆ పదవికే కుంబ్లే వన్నె తెచ్చాడు. గతేడాది వెస్టిండీస్‌ పర్యటనతో కోచ్‌గా కుంబ్లే ప్రస్థానం ఆరంభమైన సంగతి తెలిసిందే. అక్కడ టెస్టు సిరీస్‌లో భారత్‌ 2-0తో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్‌ ఓడింది. కుంబ్లే హయాంలో భారత్‌ కోల్పోయిన ఏకైక ద్వైపాక్షిక సిరీస్‌ ఇదే.

ఆ తర్వాత సొంతగడ్డపై భారత్‌ వరుసగా న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాలపై సిరీస్‌లు కైవసం చేసుకుంది. ఇక అనిల్ కుంబ్లే చివరగా బాధ్యతలు నిర్వర్తించిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ రన్నరప్‌గా నిలిచింది. అలాంటి కుంబ్లే పట్ల బోర్డు ఇలా వ్యవహరించడం క్రికెట్ అభిమానులను సహించలేక పోతున్నారు.

కుంబ్లే ఆటగాడిగా ఎలాంటి వాడో చెప్ప‌డానికి ఈ ఫొటోనే నిద‌ర్శ‌నం

కుంబ్లే ఆటగాడిగా ఎలాంటి వాడో చెప్ప‌డానికి ఈ ఫొటోనే నిద‌ర్శ‌నం

అంతర్జాతీయ క్రికెట్లో కుంబ్లే ఆటగాడిగా ఎలాంటి వాడో చెప్ప‌డానికి ఈ ఒక్క ఫొటోనే నిద‌ర్శ‌నం. బంతి త‌గిలి త‌న ద‌వ‌డ ప‌గిలినా.. క‌ట్టుతోనే వ‌చ్చి బౌలింగ్ చేసిన క‌మిట్‌మెంట్ అత‌నిది. భారత స్పిన్నర్లలో ఎవరూ నమోదు చేయలేని గొప్ప రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆటగాళ్ల పట్ల క‌ఠినంగానే వ్యవహరిస్తాడు

ఆటగాళ్ల పట్ల క‌ఠినంగానే వ్యవహరిస్తాడు

అలాంటి ఆటగాడు కోచ్ అయితే క‌చ్చితంగా ఆటగాళ్ల పట్ల క‌ఠినంగానే వ్యవహరిస్తాడు. తాను ఎంత చేస్తే ఆ స్థాయికి వ‌చ్చాడో కుంబ్లేకు బాగా తెలుసు. అదే త‌న ఆటగాళ్ల నుంచీ కోరుకుంటాడు. కానీ కోచ్ ఎలా ఉండాలో, ఎవ‌రుండాలో చెప్పే అధికారం కెప్టెన్‌కు ఎవ‌రిచ్చారో అర్థం కావ‌డం లేదు. ఇదే విషయాన్ని సీఏసీ సైతం స్పష్టం చేసింది.

క్రికెట్ సలహా కమిటీ సైతం

క్రికెట్ సలహా కమిటీ సైతం

కుంబ్లే, కోహ్లీల మధ్య నెలకొన్న విభేదాలను చక్కదిద్దే క్రమంలో క్రికెట్ సలహా కమిటీ సైతం కుంబ్లే వైపే మొగ్గు చూపడం విశేషం. ఛాంపియన్స్ ట్రోఫీ ఆనంతరం కోచ్‌‌గా కుంబ్లే పదవీ కాలం ముగిసినప్పటికీ వెస్టిండిస్ పర్యటనకు కూడా కుంబ్లేని కోచ్‌గా నియమించింది. అయితే కోచ్‌గా తన పద్ధతులపై కెప్టెన్‌కు అభ్యంతరాలున్నట్లుగా బోర్డు తనకు తెలిపిన నేపథ్యంలో కుంబ్లే రాజీనామా చేశాడు.

కుంబ్లేను అవ‌మాన‌క‌ర రీతిలో సాగ‌నంప‌డంపై

కుంబ్లేను అవ‌మాన‌క‌ర రీతిలో సాగ‌నంప‌డంపై

ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే రాజీనామాను భారత క్రికెట్‌కు దుర్దినంగా దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ అభివర్ణించాడు. అనిల్ కుంబ్లేను అవ‌మాన‌క‌ర రీతిలో సాగ‌నంప‌డంపై సునీల్ గ‌వాస్క‌ర్ తీవ్రంగా మండిప‌డ్డాడు. కోచ్‌ను కాదు.. అత‌న్ని వ్య‌తిరేకించే ప్లేయ‌ర్స్‌ను టీమ్ నుంచి సాగ‌నంపాల‌ని గవాస్కర్ స్ప‌ష్టంచేశాడు. ఇలా ప్లేయ‌ర్స్ చెప్పినట్లు కోచ్‌ను మార్చ‌డం ఎలాంటి సంకేతాల‌ను పంపిస్తుందో తేల్చుకోవాల‌ని బోర్డుకు సూచించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+