Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అధికారికం: కపిల్ దేవ్ బయోపిక్‌లో రణవీర్ సింగ్

హైదరాబాద్: ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, బాక్సర్ మేరీ కోమ్, ఒలింపిక్ రన్నర్ మిల్కాసింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

కపిల్ జీవిత చరిత్ర వెండితెరపై

కపిల్ జీవిత చరిత్ర వెండితెరపై

తాజాగా ఇప్పుడు మరో దిగ్గజ క్రీడాకారుడు జీవిత చరిత్ర వెండితెరపై అవిష్కృతం కాబోతుంది. భారత్‌కు తొలి వరల్డ్ కప్ అందించిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను నిర్మిస్తున్నారు. అయితే కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్ సింగ్, అర్జున్ కపూర్‌లలో ఎవరో ఒకరు నటిస్తారని గతంలో వార్తలు వచ్చాయి.

తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో వెల్లడి

అయితే దీనిపై మొత్తానికి స్పష్టత వచ్చింది. కపిల్‌దేవ్ పాత్రను ఎవరు పోషిస్తున్నారో అధికారికంగా వెల్లడైంది. తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న బాలీవుడ్ యువ హోరీ రణ్‌వీర్ సింగ్‌.. కపిల్‌దేవ్ పాత్ర పోషించనున్నాడు. ఈ మేరకు బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

చిన్నప్పటి నుంచి 1983 వరల్డ్ కప్ వరకు

చిన్నప్పటి నుంచి 1983 వరల్డ్ కప్ వరకు

చిన్నప్పటి నుంచి చారిత్రాత్మక 1983 ఐసీసీ వరల్డ్ కప్ విజయం వరకు ఉన్న కపిల్ ప్రయాణాన్ని వెండితెరపై అద్భుతంగా చూపించనున్నారు. ప్రస్తుతం రణ్‌వీర్ ‘పద్మావతి' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రాణి పద్మినిగా దీపికా పదుకొనే, రాజా రవల్ రతన్ సింగ్‌గా షాహిద్ కపూర్ నటిస్తున్నారు.

రణవీర్ ప్రస్తుతం పద్మావతి సినిమాలో బిజీగా

రణవీర్ ప్రస్తుతం పద్మావతి సినిమాలో బిజీగా

ఇక ఈ చిత్రంలో రణ్‌వీర్ అతి పరాక్రమశాలి అల్లావుద్దీన్ ఖిల్జీగా కనిపించనున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలకు సిద్ధమవుతోంది. ‘పద్మావతి' పూర్తయిన తర్వాత కపిల్‌దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించే సినిమా ప్రారంభం అవుతుంది. ‘బజరంగీ భాయీజాన్', ‘సుల్తాన్', ‘ఏక్తా టైగర్' వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన కబీర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+