ప్రశాంతంగా ఉండండి: భారత్ Vs పాక్ మ్యాచ్ యుద్ధం కాదు

హైదరాబాద్: భారత్-పాక్ మ్యాచ్‌ని ఒక మ్యాచ్‌గానే పరిగణించాలని.. యుద్ధంలా భావించరాదని పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
భారత్-పాక్ మ్యాచ్ అంటే చాలు భావోద్వేగాలతో కూడుకుని ఉంటుంది. ఇరు దేశాల్లో అభిమానులకు ఈ మ్యాచ్ ఎంతో ప్రత్యేకం. అభిమానులు ఓటమిని అసలు జీర్ణించుకోలేరు. తమ దేశం గెలవాలంటే తమ దేశం గెలవాలని కోరుకుంటారు. అయితే, భారత్-పాక్ మధ్య జరిగేది ఒక క్రికెట్ మ్యాచేనని, యుద్ధం కాదని మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

అక్రమ్ మాట్లాడుతూ
అక్రమ్ మాట్లాడుతూ " ప్రతి మ్యాచ్‌లోనూ గెలుపోటములు ఉండటం సహజం. ఇరుదేశాల మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అభిమానులు ఈ మ్యాచ్ చాలా పెద్దదిగా చూస్తారు. కాబట్టి ఇరు జట్ల అభిమానులను నేను కోరేది ఒక్కటే.. మ్యాచ్ అన్నప్పుడు ఇందులో ఒక జట్టు గెలుస్తుంది. మరో జట్టు ఓడిపోతుంది" అని అన్నాడు.

దీనిని ఓ యుద్ధంలా భావించవద్దు
"అంతేకానీ దీనిని ఓ యుద్ధంలా భావించవద్దు. అలా ఆలోచించే వాళ్లు క్రికెట్ అభిమానులు నిజమైన క్రికెట్ అభిమానులు కాదు. ఈ విషయంలో ఇరు దేశాల క్రికెట్ అభిమానులు స్పూర్తిదాయకంగా ఉండాలి. ఆటను ఆస్వాదించడానికే ప్రాధాన్యతనివ్వాలి" అని వసీం అక్రమ్ పేర్కొన్నాడు.

ఆ రికార్డుని తిరగరాస్తుంది
ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్ జట్టు ఒక్కసారి కూడా భారత్‌ను ఓడించలేకపోయింది. 1992 నుండి 2015 ప్రపంచకప్ వరకు భారత్, పాక్‌లు ఆరుసార్లు తలపడగా.. ఆరుసార్లు భారతే విజేతగా నిలిచింది. కానీ, ఈసారి జరిగే ప్రపంచకప్‌లో ఈ రికార్డుని తిరగరాస్తుందని వసీం అక్రమ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

భారత్‌తో ప్రపంచకప్ మ్యాచ్‌లు ఓడాం
1992, 1999, 2003 ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ చేతిలో ఓడిన పాక్ జట్టులోవసీం అక్రమ్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. "అవును. భారత్‌తో ప్రపంచకప్ మ్యాచ్‌లు ఓడాం. వాటి నేను గుర్తుచేసుకోవాలనుకోవడం లేదు. కానీ అభిమానులు ఎక్కడ ఉన్నా టీవీలకు అతుక్కుపోవడం వంటి నాటి పరిస్థితులను బాగా ఆస్వాదించాను. ఆదివారం కూడా ఇవే పరిస్థితులు పునరావృతం కానున్నాయి" అని అక్రమ్ అన్నాడు.

భారత బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ బలంగా ఉంది
ఇరు జట్ల ప్రదర్శన గురించి మాట్లాడుతూ "భారత బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. కానీ పాకిస్థాన్ వారితో సరితూగగలదు. అయితే ఇరు జట్లు మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏ జట్టయితే ఒత్తిడిని అధిగమిస్తుందో ఆ జట్టుదే విజయం" అని వసీం అక్రమ్ తెలిపాడు. భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి ఉండదని, అభిమానులు పూర్తి మ్యాచ్‌ను ఆస్వాదిస్తారని అక్రమ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
{headtohead_cricket_3_5}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications