Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆశ చంపుకోను: మూడో పెళ్లిపై ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. తనకు మూడో వివాహం చేసుకునే ఆలోచన ఉందని చెబుతున్నాడు. అంతేగాక, ఎవరి జీవితంలోనైనా విడాకులు అనేది చాలా దురదృష్ఖకరమైన విషయమని, ఇప్పటికే రెండు సార్లు విడాకులు తీసుకున్న అనుభవంతో చెబుతున్నానని అన్నాడు.

అయితే తాను రాజీపడనని, మూడో పెళ్లికి కూడా తాను సిద్ధమని పేర్కొన్నాడు. మూడో పెళ్లితో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు ఇమ్రాన్. పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్‌గా వెలుగు వెలిగిన ఈ 63ఏళ్ల మాజీ ఆటగాడు.. గత కొంత కాలంగా పాక్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగాడు.

ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ మొదటిసారి తన వ్యక్తిగత జీవితం గురించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం తాను ఒంటరిగా ఉన్నానని, బ్యాచిలర్ లైఫ్ బోర్ కొడుతోందని ఆయన చెప్పుకొస్తున్నాడు. తాను 40ఏళ్ల వయసులో మొదటి పెళ్లి చేసుకున్నానని, ఇద్దరు పిల్లలు పుట్టాక భార్యతో విడిపోవడం జరిగిందని చెప్పాడు.

ఆ తర్వాత గత సంవత్సరం జనవరిలో రెండో పెళ్లి చేసుకున్నానని, ఆమెతో కూడా విడిపోయినట్లు వివరించాడు ఇమ్రాన్. 'క్రికెట్‌లో మంచి జోరు మీదున్నప్పుడే మా వాళ్లు పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి చేశారు. కానీ ఒక పని అనుకుంటే నా లక్ష్యమంతా దానిమీదే ఉంటుంది. అప్పట్లో క్రికెటే నా ప్రాణం. అందుకే క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్ అయ్యాకే జెమీనాను పెళ్లాడా' అని ఇమ్రాన్ తెలిపాడు.

Imran Khan

ఆ తర్వాత 'పదకొండేళ్ల మా అనుబంధానికి తీపి గుర్తులు ఇద్దరు పిల్లలు. ఎప్పుడైతే నా లక్ష్యం దేశంపైకి.. అంటే రాజకీయాలవైపు మళ్లిందో అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. జెమీనా పాకిస్థాన్‌లో ఉండలేని.. నేనేమో పాకిస్థాన్‌ను వీడలేని పరిస్థితి. దీంతో క్రమంగా ఇద్దరి మధ్య పూడ్చలేని అగాథం ఏర్పడింది. విడిపోక తప్పలేదు. మొదటి వివాహం రద్దయిన తర్వాత దాదాపు 10 ఏళ్లు నేను ఒంటరిగానే ఉన్నా. అందుకు బలమైన కారణం ఉంది' అని వివరించాడు.

'నేనూ, జెమీనా విడిపోయినప్పుడు మా పిల్లలకు 9, 11 ఏళ్లు. తల్లిదండ్రులు విడిపోయారనే దానికంటే వాళ్లు వేరొకిరిని పెళ్లి చేసుకున్నారనే భావన పిల్లలల్లో కలిగితే కుంగిపోతారని నా స్నేహితుడైన మానసిక వైద్యుడొకరు చెప్పారు. అందుకే ఆమెతో విడిపోయిన 10ఏళ్ల వరకూ నేను రెండో పెళ్లి చేసుకోలేదు. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఒంటరిగా ఉంటూ నేను పడే బాధను అర్థం చేసుకుంటారనే ఉద్దేశం కలిగిన తర్వాతే.. 2015లో బిబిసి మాజీ ఉద్యోగి రెహమ్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నా. అయితే, రేహమ్ నేను 10 నెలలకే విడిపోయాం. మళ్లీ నా వ్యక్తిగత జీవితాన్ని ఒంటితనం ఆవహించింది' అని ఆవేదన చెప్పుకొచ్చాడు.

'ఎన్ని కష్టాలు ఎదురైనా, నిలబడి పోరాడాలనే నేను కోరుకుంటా. రాజకీయాల్లోనూ అంతే. పార్టీ పెట్టిన మొదట్లో ఎన్నెన్నో సందేహాలు, సవాళ్లు. ఇప్పుడు నా పార్టీ నిలబడింది. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపడతామనే నమ్మకం ఉంది. అలాగే పర్సనల్ లైఫ్‌లో సంతోషంగా ఉండేందుకు మూడో పెళ్లి చేసుకోవాలనుకుటున్నా. ఇప్పుడు నాకు 63 ఏళ్లు. అన్ని విధాలా తగిన మహిళ దొరుకుతుందన్న ఆశ లేదు. కానీ నేను దేవుణ్ని అమితంగా నమ్ముతా. ఆయన ప్రణాలిక ఎలా ఉందోమరి!' అంటూ తన మనసులోని మాటను చెప్పాడు ఇమ్రాన్ ఖాన్.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+