Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెంగళూరులో రెండో టీ20: రికార్డుల వేటలో రోహిత్, ధోని, కోహ్లీ

India Vs Australia 2nd T20I : MS Dhoni Vs Virat Kohli In Race For Half-Century Of Sixes | Oneindia
Its MS Dhoni vs Virat Kohli in race for half-century of sixes; Rohit Sharma looks to surpass Chris Gayle

హైదరాబాద్: రెండు టీ20ల సిరిస్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం రాత్రి 7 గంటలకు భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది. విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆసీస్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఈ సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన తప్పక గెలవాల్సిన పరిస్థితి తలెత్తింది.

తొలి టీ20లో

తొలి టీ20లో

విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీలు తన మార్కుని చూపించడంలో విఫలమయ్యారు. మరోవైపు ధోని సైతం 37 బంతుల్లో 29 పరుగులు చేసి విమర్శల పాలయ్యాడు. కేవలం కేఎల్ రాహుల్ ఒక్కడే హాఫ్ సెంచరీతో ఫరవాలేదనిపించాడు. ఈ నేపథ్యంలో రెండో టీ20లో గెలిచి మ్యాచ్‌ని సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది.

టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా

టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, ధోని, విరాట్ కోహ్లీలు అనేక రికార్డులను అందుకోనున్నారు. రెండో టీ20లో రోహిత్ శర్మ రెండు సిక్సర్లు కొడితే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో మార్టిన్ గుప్టిల్, క్రిస్‌గేల్ 103 సిక్సర్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

* 103 (52 innings): క్రిస్ గేల్ (వెస్టిండిస్)

* 103 in (74 innings): మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్)

* 102 in (86 innings): రోహిత్ శర్మ (ఇండియా)

* 91 in (70 innings): బ్రెండన్ మెక్‌కల్లమ్ (న్యూజిలాండ్)

రెండో స్థానంలో కొనసాగుతున్న రోహిత్ శర్మ

రెండో స్థానంలో కొనసాగుతున్న రోహిత్ శర్మ

ప్రస్తుతం 102 సిక్సర్లతో ఉన్న రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, భారత్ తరఫున టీ20ల్లో రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డ్‌లో అగ్ర స్థానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాత యువరాజ్ సింగ్ 72 సిక్సర్లతో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సిక్సర్ల రికార్డుని అందుకోవడానికి ధోనికి ఒక సిక్స్, కోహ్లీకి రెండు సిక్సులు అవసరం.

* 102 (86 innings): రోహిత్ శర్మ

* 74 in (51 innings): యువరాజ్ సింగ్

* 56 in (66 innings): సురేశ్ రైనా

* 49 in (84 innings): ధోని

* 48 in (61 innings): విరాట్ కోహ్లీ

Story first published: Wednesday, February 27, 2019, 16:14 [IST]
Other articles published on Feb 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+