Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మనమంతా టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్నాం: కుంబ్లే

It’s like 2nd innings of Test match: Anil Kumble on fight against Coronavirus

ముంబై: కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రస్తుత పరిస్థితులను 'టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌'తో పోల్చారు టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే. ప్రజల ప్రాణాలతో ఆటాఆడుకుంటున్న కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రపంచమంతా సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇదో టెస్టు మ్యాచ్‌ లాంటిది.. టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు మాత్రమే ఉంటాయి, కానీ కరోనాకు ఎన్నో దశలున్నాయన్నాయని జంబో పేర్కొన్నారు.

రెండో ఇన్నింగ్స్‌లో కఠినంగా పోరాడాలి

రెండో ఇన్నింగ్స్‌లో కఠినంగా పోరాడాలి

'కరోనా మహమ్మారిని నిర్మూలించాలంటే మనందరం ఉమ్మడిగా పోరాడాల్సిందే. ఇదో టెస్టు మ్యాచ్‌లాంటిది. టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు మాత్రమే ఉంటాయి కానీ కరోనాకు ఎన్నో దశలున్నాయి. అందుకే ఇప్పటివరకు కరోనాపై సాధించిన విజయంతో సంబరపడొద్దు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంకా గడ్డు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించామని సంతోష పడకూడదు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతోనే లభించే విజయం కాదు ఇది. అందుకే దీన్ని జయించేందుకు రెండో ఇన్నింగ్స్‌లో మనమంతా కఠినంగా పోరాడాలి' అని కుంబ్లే తన ట్విట్టర్ ఖాతాలోని వీడియోలో పేర్కొన్నారు.

అందరికి హ్యాట్సాఫ్‌

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం రాత్రింబవళ్లు పోరాడుతున్న వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు అధికారులకు కృతజ్ఞతలు అనిల్ కుంబ్లే తెలిపారు. వారంతా నిస్వార్థంగా సేవ చేస్తున్నారని, ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారన్నారు. అందరికి హ్యాట్సాఫ్‌ అంటూ జంబో కొనియాడారు. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 59,000 లుగా నమోదు కాగా.. ఇప్పటికే రెండు వేలమంది మరణించారు.

132 టెస్టులు, 271 వన్డేలు

132 టెస్టులు, 271 వన్డేలు

కుంబ్లే భారత్ తరపున 132 టెస్టులు, 271 వన్డేలు ఆడారు. 1990లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అనిల్ కుంబ్లే.. 132 టెస్టులాడి 619 వికెట్లు తీసారు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా జంబో నిలిచారు. 2008లో టెస్టులకి కుంబ్లే వీడ్కోలు పలికారు. ఇక 271 వన్డేలలో 337 వికెట్లు కూల్చారు. ఒక మ్యాచులో ఐదు వికెట్లు రెండు సార్లు తీశారు.

ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు

ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు

అనిల్‌ కుంబ్లే తన లెగ్ స్పిన్ బౌలింగ్‌తో ఎన్నో విజయాలు టీమిండియాకు అందించారు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి నేనున్నా అంటూ ఆదుకునేవారు. అయితే కుంబ్లే ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా, మరెన్నో ఘనతలు సాధించినా అతడు ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన సందర్భం మాత్రం ఎంతో ప్రత్యేకం. ఆ క్షణాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. 1999 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌పై జంబో అంతర్జాతీయ టెస్ట్‌ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిట్టారు. దీంతో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించారు.

Story first published: Sunday, May 10, 2020, 11:35 [IST]
Other articles published on May 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+