ఎనిమిది యాషెస్ సిరీస్‌ల్లో
1989-2003 మధ్య కాలంలో జరిగిన ఎనిమిది యాషెస్ సిరీస్‌ల్లో ఆస్ట్రేలియా వరుస విజయాల పరంపరను కొనసాగించింది. అయితే, ఈసారి యాషెస్ కాస్త భిన్నంగా జరుగుతోంది. సంప్రదాయ టెస్టు క్రికెట్‌ను అభిమానులకు మరింతగా చేరువ చేసేందుకు గాను ఐసీసీ ప్రవేశ పెట్టిన టెస్టు ఛాంపియన్‌షిప్ ఈ సిరీస్‌తోనే మొదలవుతుండటం విశేషం.

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మొత్తం 9 జట్లు
ఈ ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మొత్తం 9 జట్లు పోటీలో పాల్గొంటాయి. రెండేళ్లలో 71 మ్యాచులు, 27 సిరీస్‌లు జరుగుతాయి. చివరిగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఇంగ్లాండ్ వేదికగా 2021, జూన్‌న జరగనున్న పైనల్లో తలపడతాయి. దీంతో వచ్చే రెండేళ్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టు టెస్టు ఛాంపియన్‌గా అవతరిస్తుంది.

2017లో తన సొంతగడ్డపై జరిగిన
కాగా, చివరగా 2017లో తన సొంతగడ్డపై జరిగిన యాషెస్ సిరిస్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. అయితే, ఆ సిరిస్‌కు ముందు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ నైట్ క్లబ్ వివాదంలో చిక్కుకుని యాషెస్ సిరిస్‌కు దూరమయ్యాడు. ఇది ఇంగ్లాండ్ జట్టుపై పెను ప్రభావాన్ని చూపింది. జట్టులో సమతూకం దెబ్బ తినడంతో పాటు స్వదేశంలో అనుకూలత ఆసీస్‌కు కలిసొచ్చింది.

సొంతగడ్డపై దెబ్బకు దెబ్బ తీయాలని ఇంగ్లాండ్
దీంతో ఇప్పుడు సొంతగడ్డపై దెబ్బకు దెబ్బ తీయాలని ఇంగ్లాండ్ పట్టుదలతో ఉంది. ఇటీవలే సొంతగడ్డపై ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలివడంలో బెన్ స్టోక్స్ కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు అద్భుతమైన ఫామ్‌లో కూడా ఉన్నాడు.ఇక, ఇంగ్లాండ్ జట్టు సైతం భయం లేని క్రికెట్ ఆడుతోంది. ఇదే ఊపులో యాషెస్ కూడా గెలవాలని ఇంగ్లాండ్ జట్టు కసిగా ఉంది.

ఆరు నెలల ముందు జరిగుంటే
ఇదే యాషెస్ సిరిస్ గనుక ఆరు నెలల ముందు ఆస్ట్రేలియా జట్టు చిత్తుగా ఓడేదే. ఎందుకంటే గత రెండేళ్లలో యాషెస్‌ను మినహాయిస్తే ఆస్ట్రేలియా సిరీస్ గెలిచింది ఒక్క శ్రీలంకపై మాత్రమే. దక్షిణాఫ్రికా, భారత్, పాకిస్థాన్‌లతో జరిగిన టెస్టు సిరిస్‌లలో ఓటమిపాలైంది. అయితే, ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

స్మిత్, వార్నర్ పునారగమనంతో
బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది పాటు నిషేధానికి గురై కీలక ఆటగాళ్లను కోల్పోవడంతో ఆసీస్ ఆటలో లయ లోపించింది. అయితే, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు తిరిగి జట్టులోకి రావడంతో ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేసింది. ప్రపంచకప్‌లో తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు యాషెస్‌లో రాణించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications
