వర్షం వల్ల తొలి సెమీస్ తుడచి పెట్టుకుని పోతే.. టీమిండియా పరిస్థితేంటీ?

మాంచెస్టర్: మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్ వరుణదేవుడి గండం పొంచివుంది. మ్యాచ్ సందర్భంగా వర్షం కురిసే అవకాశం ఉందని అంటూ మాంచెస్టర్‌లోని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే.. పరిస్థితేమిటనేది చర్చనీయాంశమైంది. మంగళవారం నాటి ఆట రద్దయితే.. రిజర్వ్ డే ఉండనే ఉంది. అదే మ్యాచ్‌ను అదే స్టేడియంలో బుధవారం నిర్వహిస్తారు. అక్కడిదాకా బాగానే ఉంది. బుధవారం కూడా వర్షం పడి మ్యాచ్ రద్దయితే? అనే ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతోంది.
మ్యాచ్ రద్దయితే ఏమౌతుంది? చెరో పాయింట్ ఇస్తారు. అత్యధిక పాయింట్లు, మెరుగైన రన్‌రేట్‌ను పరిగణనలోకి తీసుకుంటుంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఇప్పటికే 15 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా ఆటోమేటిక్‌గా ఫైనల్‌కు చేరుకుంటుంది. పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉంది. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో అయిదింట్లో నెగ్గి, మూడింట్లో ఓటమి పాలయ్యారు బ్లాక్ క్యాప్స్.
దీనితో వారి ఖాతాలో ప్రస్తుతం 11 పాయింట్లే ఉన్నాయి. అదే వారికి శాపంగా మారే అవకాశాలు లేకపోలేదు. వర్షం వల్ల ఒక పాయింట్ దక్కినప్పటికీ.. వాటి సంఖ్య డజనుకే చేరుకుంటుంది. వర్షం పడి- రిజర్వ్ డే కూడా మ్యాచ్ రద్దయితే- మెరుగైన రన్ రేట్, పాయింట్లను కలిగి ఉండటం వల్ల టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటుంది. న్యూజిలాండ్ క్రికెటర్లు ఇక ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications