Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లలిత్ మోడీని ప్రశ్నించిన ఐటి అధికారులు

Lalit Modi
ముంబై: ఆర్థిక లావాదేవీలపై, వాటాల విధానాలపై ఆదాయం పన్ను శాఖాధికారులు ఐపియల్ చైర్మన్ లలిత్ మోడీని ఎనిమిది గంటల పాటు విచారించారు. లలిత్ మోడీని ప్రశ్నించిన తర్వాత వారు శుక్రవారం ఉదయం వర్లిలోని ఆయన కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఐటి అధికారులు వాంఖెడే స్టేడియంలోని ఐపియల్ కేంద్ర కార్యాలయంలో, అప్ మార్కెట్ వర్లిలోని లలిత్ మోడీ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. వర్లిలోని కార్యాలయంలో మోడీని గురువారం సాయంత్రం 7 గంటల 15 నిమిషాల నుంచి గురువారం తెల్లవారు జామున 3 గంటల 20 నిమిషాల వరకు విచారించారు.

బిడ్డింగ్ ప్రక్రియ గురించి ఐటి అధికారులు తెలుసుకోవాలని అనుకున్నారని, దాంతో తాను వారిని ఆహ్వానించానని, ఐటి అధికారులు నగరంలోని పలు ప్రాంతాలను సందర్సిస్తున్నారని వారు వెళ్లిపోయిన తర్వాత లలిత్ మోడీ మీడియా ప్రతినిధులతో చెప్పారు. వారికి తాను డాక్యుమెంటేషన్ వివరాలను ఇచ్చానని, వారు వాటిని పరిశీలించారని, తాను వారికి పూర్తిగా సహకరించానని ఆయన చెప్పారు. విచారణ కొద్ది నిమిషాలు మాత్రమే సాగిందని, పత్రాల పరిశీలనకు సమయం తీసుకున్నారని ఆయన చెప్పారు. కొత్త కన్షార్షియాలు సహారా, కొచ్చి ఫ్రాంచైజీల పత్రాలు పరిశీలించినట్లు ఆయన తెలిపారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+