ధోనీ రిటైర్‌మెంట్‌పై స్పందించిన సచిన్


హైదరాబాద్: ధోనీ మునుపటిలా ఆడలేకపోతున్నాడు. అతని ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. ఇలా అయితే వన్డే ప్రపంచ కప్ టోర్నీ జట్టులో చోటు దక్కించుకోవడం చాలా కష్టం. అంటూ పలువురు ధోనీ ఇటీవల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా కొద్ది రోజుల ముందే పరిమిత ఓవర్ల సిరీస్ పూర్తి చేసుకుంది. ఈ టీ20, వన్డే సిరీస్‌లలో ధోనీ సరిగా రాణించలేకపోయాడు.

ధోనీ రిటైర్‌మెంట్ ప్రకటిస్తే బాగుంటుంది:
దీంతో క్రికెట్ ప్రముఖులతో పాటు, విమర్శకులు సైతం ధోనీ రిటైర్‌మెంట్ ప్రకటిస్తే బాగుంటుంది అన్నట్లు స్పందించారు. అయితే ఈ వ్యాఖ్యలపై సచిన్ ఇలా అన్నారు. వచ్చే ప్రపంచకప్‌కు జట్టులో ధోనీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరూ సిద్ధంగా లేరంటూ సచిన్ ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

కోహ్లీ, రవిశాస్త్రి ఎలాంటి ఆలోచనల్లో
ప్రపంచకప్ గురించి కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి ఎలాంటి ఆలోచనల్లో ఉన్నారో తెలియదు. అయినా దానికి ఇంకా దాదాపు సంవత్సరం పాటు సమయం ఉంది. ఇక ధోనీ విషయానికొస్తే ప్రపంచకప్‌లో ఆడాలా వద్దా అనేది తనకు తానే నిర్ణయించుకోగలడు. అయినా ఏం జరుగుతుందో వేచి చూద్దామంటూ' పేర్కొన్నాడు.

జట్టులో చాలా మార్పులు జరిగాయి
ఇటీవల ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ను ఒకసారి పరిశీలిస్తే.. సిరీస్‌లో భాగంగా జట్టులో చాలా మార్పులు జరిగాయి. అలా అని అవన్నీ ఆటగాడి ప్రదర్శన ఆధారంగా చేసినవి కావు. వాటిలో కొన్ని ఆటగాడి ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకొని చేసినవి కూడా ఉన్నాయి.

ధోనీకి ప్రత్యామ్నాయంగా ఎవరూ లేరు
ఇక ప్రపంచకప్‌లో ధోనీకి ప్రత్యామ్నాయంగా ఎవరూ లేరు. దినేశ్ కార్తీక్ కొంతకాలంగా జట్టులో స్థానం దక్కించుకుంటున్నా.. అతనికి వన్డే క్రికెట్‌లో ఆడే అవకాశాలు అంతగా రావటం లేదు. అయితే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అతని ప్రదర్శనే వన్డేల్లో అతని భవిష్యత్తును నిర్ణయించేలా ఉందని సచిన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications