Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB కొత్త జట్టు ఇదే.. మరో చెత్త నిర్ణయమా? బలాలేంటి? బలహీనతలేంటి?

ఐపీఎల్ మినీ వేలం ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకున్న నిర్ణయాలపై మిశ్రమ స్పందన వస్తోంది. బౌలింగ్ అటాక్‌ను బలోపేతం చేసుకోవాలని వేలంలో అడుగుపెట్టిన బెంగళూరు ఫ్రాంచైజీ అంచనాలు లేని ప్లేయర్లపై భారీధర వెచ్చించింది. అయితే వారి రాకతో జట్టు పరిస్థితి ఎలా మారనుంది? బౌలింగ్‌లో ఆప్షన్స్ ఎలా ఉన్నాయి?

వేలానికి ముందు అంటిపెట్టుకున్న ఆటగాళ్లు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, కామెరాన్ గ్రీన్ (ట్రేడెడ్), రజత్ పటిదార్, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్ (ట్రేడెడ్), ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, విజయ్ కుమార్ వైషాక్

It is the Royal Challengers Bangalores new team.. Another worst decision? What are the strengths? What are the weaknesses?

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: అల్జారి జోషెఫ్‌ (రూ. 11.50 కోట్లు), యశ్‌ దయాల్‌ (రూ. 5 కోట్లు), ఫెర్గూసన్‌ (రూ. 2 కోట్లు), టామ్‌ కరన్‌ (రూ. 1.50 కోట్లు), సౌరభ్‌ చౌహాన్‌ (రూ. 20 లక్షలు), స్వప్నిల్‌ సింగ్‌ (రూ. 20 లక్షలు)

వేలానికి ముందు వదులుకున్న ఆటగాళ్లు: హసరంగ, హర్షల్‌, హేజిల్‌వుడ్‌, ఫిన్‌ అలెన్‌, బ్రేస్‌వెల్‌, విల్లీ, పార్నెల్‌, సోను యాదవ్‌, షాబాజ్‌ అహ్మద్‌, అవినాశ్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, కేదార్‌ జాదవ్‌

హసరంగ, హర్షల్ పటేల్, హేజిల్‌వుడ్‌లను ఆర్సీబీ పక్కా ప్రణాళికతో వదులుకుంది. కప్ కలను ఈ ఏడాది అందుకోవాలని దాని కోసం బౌలింగ్ యాక్షన్‌ మార్చాలనుకుంది. దాని కోసం వేలానికి ముందే ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను భారీ మొత్తానికి ముంబయి ఇండియన్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది. అయితే ప్యాట్ కమిన్స్ కోసం వేలంలో ఆర్సీబీ బాగానే ట్రై చేసింది. తమ పర్స్‌లో రూ.23.15 కోట్లు ఉన్న టైమ్‌లో రూ.20.25 కోట్ల వరకు వేలం పాడింది.కానీ ఫైనల్‌గా కమిన్స్‌ను దక్కించుకోలేకపోయింది.

అయితే అనూహ్యంగా వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ కోసం రూ.11.50 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ నిర్ణయంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డుప్లెసిస్‌ కెప్టెన్సీలో జోసెఫ్ మెరుగ్గా రాణించినందకు అతడిని కొనుగోలు చేశామని, ముందుగానే జోసెఫ్ కోసం ప్లాన్ చేశామని ఫ్రాంచైజీ చెప్పుకొచ్చినా.. అది చెత్త నిర్ణయమే అని భావిస్తున్నారంతా. సౌతాఫ్రికాలో అల్జారీ జోసెఫ్ ప్రదర్శన పేలవంగా సాగింది. అతడికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయడంతో స్టార్క్ కోసం వేలంలో పోటీకి రాలేకపోయింది.

ఇక డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరున్న హర్షల్ పటేల్‌ను వదులుకున్న ఆర్సీబీ లెఫ్ట్ ఆర్మర్ యశ్ దయాల్‌ను తీసుకుంది. యశ్ కోసం రూ.5 కోట్లు వెచ్చించింది. గణాంకాలతో పోలిస్తే అన్ని విధాలుగా యశ్ కంటే హర్షల్ మెరుగైనవాడు. మరోవైపు ఓవర్సీస్ పేసర్లకు బ్యాకప్‌గా లాకీ ఫెర్గూసన్, టామ్ కరన్‌ను తీసుకున్నారు. ఫెర్గూసన్ ఎంపిక గొప్పగానే ఉంది.

అయితే బెంగళూరు రూ. కోట్లు వెచ్చించినా వచ్చే సీజన్‌లోనూ బౌలింగ్ సమస్య ఎదురయ్యేలా ఉంది. డెత్ స్పెషలిస్ట్‌తో పాటు టాప్ ర్యాంకర్ స్పిన్నర్ బెంగళూరు జట్టులో లేడు.హసరంగను వదులుకోవడంతో క్వాలిటీ స్పిన్నర్‌ను కోల్పోయింది. మయాంక్ దాగర్,మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, గ్లెన్ మాక్స్‌వెల్‌, స్వప్నిల్ సింగ్ వంటి స్పిన్నర్లు ఉన్నా.. వారంతా మ్యాచ్ విన్నర్లు కాదు. అయితే పొట్టి ఫార్మాట్‌లో ఎప్పుడేం జరుగుతుందో అంచనా వేయలేం. ఆర్సీబీ దగ్గర ఉన్న ఈ బౌలింగ్ వనరులతోనే కప్‌ను సాధించే అవకాశాలూ ఉన్నాయి.

Story first published: Wednesday, December 20, 2023, 12:10 [IST]
Other articles published on Dec 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+