మహిళా క్రికెటర్ల ఐపీఎల్‌కు సమయం ఆసన్నమైందా?
హైదరాబాద్: 'ఆఖర్లో ఒత్తిడికి గురయ్యామని అందుకే పైనల్లో ఓటమి పాలయ్యాం' వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో 9 పరుగుల తేడాతో ఓటమి పాలైన తర్వాత భారత మహిళల కెప్టెన్ మిథాలీరాజ్ చేసిన వ్యాఖ్యలివి. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే పురుష క్రికెటర్ల మాదిరి మహిళా క్రికెటర్లకూ ఐపీఎల్ నిర్వహించేందుకు ఇదే సరైన సమయమని మిథాలీ అభిప్రాయపడుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి అనంతరం మిథాలీ రాజ్ మాట్లాడుతూ మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఇదే సరైన సమయమని అభిప్రాయపడింది. ఫైనల్లో భారత మహిళా క్రికెటర్లు ఒత్తిడి తట్టుకోలేకపోయారని దీనికి సరైన కారణం అనుభవం లేకపోవడమనే మిథాలీ పేర్కొంది. భారత మహిళా క్రికెటర్లు రాణించాలంటే ఐపీఎల్ లాంటి లీగ్‌ల్లో ఆడేంచే అవకాశం కల్పించాలని పేర్కొంది.

ఐపీఎల్ వల్ల మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరుగుతుంది
భారత మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించడం వల్ల మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరగడంతో పాటు ఆటలో నైపుణ్యాలను పెంపొందిస్తుందని మిథాలీ పేర్కొంది. ఇంగ్లాండ్ మహిళలకు ఇక్విలెంట్ సూపర్ లీగ్, ఆస్ట్రేలియాకు బిగ్ బాష్ లీగ్‌లు ఉన్నాయని ఈ తరహాలోనే భారత్‌లో కూడా మహిళా ఐపీఎల్ ప్రారంభించాలని బీసీసీఐకి సూచించింది.

హర్మన్ ప్రీత్ కౌర్ టోర్నీలో అద్భుత ప్రదర్శన
ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన హర్మన్ ప్రీత్ కౌర్ టోర్నీలో అద్భుతంగా రాణించిందని, ఆసీస్‌పై జరిగిన మ్యాచ్‌లో ఒత్తిడిని ఎలాగ అధిగమించిందో సైతం మిథాలీ వివరించింది. మిగతా మహిళా క్రికెటర్లు కూడా లీగ్‌లు ఆటడం ద్వారా అనుభవంతో పాటు ఆటను మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుందని మిథాలీ చెప్పుకొచ్చింది.

ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు గత రెండు సంవత్సరాలుగా
ఈ లీగ్‌లతో మంచి ప్రాక్టీస్ లభించడంతో పాటు మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరుగుతుందని మిథాలీ పేర్కొంది. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు గత రెండు సంవత్సరాలుగా ఫ్రోఫెషనల్ మ్యాచ్‌లు ఆడుతున్నారని అదే వారికి పైనల్లో కలిసొచ్చేలా చేసిందని వ్యాఖ్యానించింది. వరల్డ్ కప్ మ్యాచ్‌లు టీవీలో ప్రసారం కావడం మహిళా క్రికెటర్లుగా మేం గర్విస్తున్నామని మిథాలీ సంతోషం వ్యక్తం చేసింది.

ఫైనల్లో వారి భాగస్వామ్యాన్ని నిలబెట్టలేకపోయాం
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో పూనమ్, హర్మన్ ప్రీత్ కౌర్‌లు చేసిన పోరాటం అద్భుతమని అయితే ఆ భాగస్వామ్యాన్ని ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రికెటర్లు నిలబెట్టలేకపోయారని తెలిపింది. టోర్నీ సాంతం తమ జట్టు మంచి ప్రదర్శన చేయడంతో ప్రేక్షుకుల నుంచి సానుకూల స్పందన వచ్చిందని, బీసీసీఐ మహిళల ప్రదర్శన పట్ల సుముఖంగా ఉందని మిథాలీ పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications