Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జబ్బలు చరుచుకునే గెలుపు కాదిది.. హాంకాంగ్‌పై ఇండియా ఓటమి నుంచి తప్పించుకోడానికి 4 కారణాలివే..!

 It is Not Upto The Mark Victory for India Against Hongkong, Some Reasons that Favoured India Only

ఆసియా కప్ 2022లో టీమిండియా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలుపొందింది. హాంకాంగ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 40పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా గ్రూప్ ఏ టాపర్‌గా సూపర్ 4కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20ఓవర్లలో 2 వికెట్లకు 192పరుగులు చేయగా హాంకాంగ్ ఛేదనలో 152పరుగులకే పరిమితమైంది. అయితే భారత బౌలింగ్‌పై హాంకాంగ్ లాంటి పసికూన టీం చూపిన పోరాట పటిమ అమోఘం.. ఆ జట్టుపై భారత్ గెలిచిన విధానం గొప్పగా ఏం లేదు. ఆ మాటకొస్తే కొన్ని కారణాల వల్ల ఇండియా ఓటమి నుంచి తప్పించుకుందని చెప్పొచ్చు.

1. మరో బౌలింగ్ ఆప్షన్ లేదు కాబట్టి..

ఈ మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించి రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ముందున్న కీలక మ్యాచ్‌ల కోసం హార్దిక్‌కు జట్టు మేనేజ్ మెంట్ రెస్ట్ ఇచ్చింది. అయితే అతని స్థానంలో పంత్‌ను తుది జట్టులోకి తీసుకోవడమేంటో అర్థం కాలేదు. దీంతో భారత్ 6వ బౌలింగ్ ఆప్షన్ లేకుండా బరిలోకి దిగింది. హాంకాంగ్ బ్యాటర్లకు ఇది ప్లస్ అయింది. పేస్ పడకపోయే సరికి అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్ బౌలింగ్లో ఏకంగా 97పరుగులు పిండుకున్నారు. అంటే మిగతా 12ఓవర్లలో హాంకాంగ్ చేయాల్సిన స్కోరు.. 72బంతుల్లో 96పరుగులు. చాహల్, జడేజా బౌలింగ్లో రాణించడం, భువీ మోస్తరుగా వేయడం బట్టి సరిపోయింది. భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైతే కొంపమునిగేదే. హార్దిక్ స్థానంలో దీపక్ హుడాను తీసుకుంటే పరిస్థితి కాస్త బెటర్ ఉండేది.

2. రవీంద్ర జడేజా చేసిన రనౌట్ చేశాడు కాబట్టి..

పవర్ ప్లేలో హాంకాంగ్ ఇండియా బౌలర్లపై పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. ఆ జట్టు కెప్టెన్ నిజాఖత్ అండగా బాబర్ హయత్ (41పరుగులు 35బంతుల్లో) సిక్సులతో దడపుట్టించాడు. వీరిద్దరు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే అర్షదీప్ వేసిన పవర్ ప్లే చివరి బంతికి ఫ్రీ హిట్ బాల్ టైంలో నిజాఖత్ ఖాన్ రనౌట్ అయ్యాడు. రవీంద్రా జడేజా గల్లీలో అద్భుతంగా బంతి అందుకుని త్రో వేయడంతో కెప్టెన్ నిజాఖత్ ఖాన్ ఊహించని రీతిలో ఔటయి పెవిలియన్ బాట పట్టాడు. వికెట్ పడడంతో హాంకాంగ్ స్కోరు వేగం నెమ్మదించింది. ఈ లక్ గనుక భారత్‌కు దక్కకుంటే నిజాఖత్ ఖాన్, బాబర్ కలిసి హడలెత్తించేవారు.

3. కేఎల్ రాహుల్ ఔటయ్యాడు కాబట్టి..

ఇక భారత బ్యాటింగ్ టైంలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (36పరుగులు 39బంతుల్లో) ఆట చూసి విసుగు చెందని సగటు అభిమాని ఉండడు. అతని బ్యాటింగ్ బట్టి అతని ప్రిపరేషన్ పూర్తి కాలేదని స్పష్టమవుతుంది. గాయం నుంచి కోలుకుని ఆసియా కప్ లాంటి మెగా టోర్నీలో టీ20 మ్యాచ్‌లు ఆడడంతో అతను తొందరగా కుదురుకోక స్కోరు చేయలేకపోతున్నాడు. అతనికి తోడు కోహ్లీ సైతం డిఫెన్స్ ఆడడంతో భారత స్కోరు పూర్తిగా నెమ్మదించింది. డౌన్ ఆర్డర్లో మరో నలుగురు హిట్టర్లు ఉన్నారని తెలిసి కూడా 13ఓవర్ల వరకు వీరిద్దరు భారత స్కోరును నత్తనడకన నడిపించారు. దీంతో స్కోరు 150 దాటుతుందా లేదా అనే డౌట్ వచ్చింది. 13వ ఓవర్ చివరి బంతికి లక్కీగా కేఎల్ రాహుల్ ఓటవ్వడంతో.. సూర్య బరిలోకి దిగాడు. అప్పుడు స్కోరు 94పరుగులు. ఇక చివరి 42బంతుల్లో భారత్ 98పరుగులు పిండుకుంది.

4. సూర్యుడు ప్రతాపం చూపించాడు కాబట్టి..

మరో వైపు క్రీజులో విరాట్ కోహ్లీ (44 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీ చేసినా అతని ఇన్నింగ్స్ స్కోరు వేగాన్ని పెద్దగా పెంచలేకపోయింది. ఈ క్రమంలో బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68 నాటౌట్) ప్రతాపం చూపించాడు కాబట్టి స్కోరు 192కు చేరుకుంది. ఒకవేళ సూర్యకుమార్ త్వరగానే ఔటయినా.. లేక 35పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూ రివ్యూను హాంకాంగ్ తీసుకున్నా పరిస్థితి వేరేలా ఉండదు. ఇండియా స్కోరు 170లోపే పరిమితమయ్యేది.. స్కోరు 170 ఉండుంటే హాంకాంగ్ అప్రోచ్ వేరేలా ఉండేది. ఏదేమైనా రెండు జట్లకు మధ్య సూర్యకుమారే ప్రధాన డిఫెరెన్స్ అని చెప్పుకోవాలి.

Story first published: Thursday, September 1, 2022, 14:35 [IST]
Other articles published on Sep 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+