For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దేశం గురించి ఆలోచించరా?: ధోనీని మరోసారి టార్గెట్ చేసిన గంభీర్

‘It is not about Dhoni, it is about the country’ – Gautam Gambhir on MS Dhoni’s future in Team India

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌పై ఎక్కువగా స్పందిస్తోన్న మాజీ క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది గౌతమ్ గంభీర్ మాత్రమే. ముఖ్యంగ గత కొన్ని రోజులుగా ధోని రిటైర్మెంట్‌పై గౌతమ్ గంభీర్ కాస్త ఎక్కువగానే మాట్లాడుతున్నాడు.

ధోని భవిష్యత్తు ప్రణాళికపై సెలక్టర్లు అతడితో మాట్లాడాలని ఇటీవల సూచించిన గౌతమ్ గంభీర్‌.. తాజాగా సోమవారం ధోని రిటైర్మెంట్‌పై మరోసారి స్పందించాడు. రిటైర్మెంట్ విషయం అతడి వ్యక్తిగత నిర్ణయమి చెబుతూనే మరొవైపు... ధోని కంటే దేశం ముఖ్యమనే విషయం తెలియదా? అంటూ గంభీర్ నిలదీశాడు.

ధోని వీడ్కోలు పలుకుతానని

ధోని వీడ్కోలు పలుకుతానని

అలా కాకుండా ధోని వీడ్కోలు పలుకుతానని చెప్పేవరకూ నిరీక్షిస్తూనే ఉంటారా? అంటూ సెలక్టర్లతో పాటు జట్టు మేనేజ్‌మెంట్‌ని గంభీర్ ప్రశ్నించాడు. ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ "రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయం. మీరు ఆడాలనుకునే సమయం వరకు మీకు ఆడటానికి అనుమతి ఉంది, కానీ మీరు భవిష్యత్తును కూడా చూడాలి" అని అన్నాడు.

ధోనిని చూస్తానని నేను అనుకోవడం లేదు

ధోనిని చూస్తానని నేను అనుకోవడం లేదు

"వచ్చే వరల్డ్‌కప్‌లో ధోనిని చూస్తానని నేను అనుకోవడం లేదు. ఆ సమయానికి కెప్టెన్‌గా ఎవరున్నా ధోని మాత్రం జట్టులో ఉండడు. అప్పటికీ కెప్టెన్‌గా కోహ్లీ ఉంటాడా లేదా అనేది తెలియదు. కాకపోతే నువ్వు వచ్చే వరల్డ్‌కప్‌లో ఉండవని ధోనికి చెప్పడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి" అని గంభీర్ పేర్కొన్నాడు.

ఎదగడానికి ఇది సరైన సమయం

ఎదగడానికి ఇది సరైన సమయం

"రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో కొంతమంది యువకులు ఎదగడానికి ఇది సరైన సమయం, ఎందుకంటే ఇప్పుడు అలోచించాల్సింది ధోని గురించి కాదు... దేశం గురించి" అని గంభీర్ తెలిపాడు. అంతేకాదు యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించడం కోసం ధోనీని దాటి చూడాల్సిన సమయం వచ్చిందని చెప్పుకొచ్చాడు.

వరల్డ్‌కప్‌లో గెలవడం కోసం ఆలోచించాలి

వరల్డ్‌కప్‌లో గెలవడం కోసం ఆలోచించాలి

"వచ్చే వరల్డ్‌కప్‌లో గెలవడం కోసం ఆలోచించాలి. ప్రస్తుతం యువ క్రికెటర్లను పరీక్షిస్తున్నది ఏదైతే ఉందో అది దేశం కోసం మాత్రమే తప్ప ధోని కోసం కాదు. యువ క్రికెటర్లను పరీక్షించడానికి ధోని తమకు ఒక అవకాశం ఇచ్చాడని సెలక్టర్లు చెప్పడం విడ్డూరంగా ఉంది. వచ్చే వరల్డ్‌కప్‌ భారత్‌ గెలవాలంటే ఇప్పట్నుంచే అందుకు సంసిద్ధం కావాలి" అని గంభీర్ అన్నాడు.

పంత్‌ లేదా సంజూ శాంసన్‌

పంత్‌ లేదా సంజూ శాంసన్‌

"రిషభ్‌ పంత్‌ లేదా సంజూ శాంసన్‌ లేదా మరో యువ వికెట్‌ కీపర్లకు అవకాశం ఇవ్వాలి. వాళ్లు కూడా అవకాశాలు పొందాలి. నన్ను వ్యక్తిగతంగా అడిగితే... ఇకపై టీమిండియా ధోనిని దాటి చూడాల్సిన సమయం వచ్చేసిందని భావిస్తున్నా" అని గంభీర్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం టీమిండియా సొంతగడ్డపై మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడుతోంది. ఈ సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు అక్టోబర్ 2న విశాఖపట్నం వేదికగా ఆరంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్ల మధ్య ముగిసిన మూడు టీ20 సిరిస్ సమమైన సంగతి తెలిసిందే.

Story first published: Monday, September 30, 2019, 16:24 [IST]
Other articles published on Sep 30, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+