For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Gautam Gambhir: డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు రావొద్దు..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ భారత్ ఘోరంగా విఫలమవుతూ వస్తుంది. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు అన్నకున్న స్థాయిలో రాణించండంతో లేదు. జట్టు ఆట తీరుపై కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సెలక్షన్ కమిటీ, కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గంభీర్ కు మధ్య విభేదాలు తలెత్తిన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై గంభీర్ స్పందించాడు.

డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చలు బయటకు రాకూడదని గౌతమ్ గంభీర్ గురువారం ఆటగాళ్లతో స్పష్టం చేశాడు. జట్టు సభ్యులతో మాట్లాడాని చెప్పాడు.
డ్రెస్సింగ్ రూమ్ లో విభేదాలు అని వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టిపడేశాడు. " కోచ్, ఆటగాళ్ల మధ్య చర్చలు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండాలి. కఠినమైన మాటలు. అవి కేవలం నిజం కాదు" అని ఆస్ట్రేలియాతో శుక్రవారం ఇక్కడ ప్రారంభమయ్యే భారత్ ఐదవ, చివరి టెస్టుకు ముందు ప్రీ-మ్యాచ్ ప్రెస్ మీట్‌లో గంభీర్ పేర్కొన్నాడు.

It is learnt that Team India coach Gambhir has made it clear that dressing room matters should not be revealed

నిజాయితీ గల వ్యక్తులు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండే వరకు భారత క్రికెట్ సురక్షితమైన చేతుల్లో ఉంటుందని తెలిపాడు. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మతో టెస్ట్ మ్యాచ్‌లను ఎలా గెలవాలనే వ్యూహాల గురించి తప్ప ఎలాంటి చర్చలు జరగలేదని గంభీర్ చెప్పాడు.
"ప్రతి వ్యక్తికి ఏ ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు. మేము వారితో మాట్లాడాం. టెస్ట్ మ్యాచ్‌ ఎలా గెలవాలని మాత్రమే సంభాషించాం" అని పేర్కొన్నాడు.

పేసర్ ఆకాష్ దీప్ గాయంతో ఐదో టెస్ట్ ఆడడం లేదని గంభీర్ ధృవీకరించాడు. అయితే అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది చెప్పలేదు. కాగా
మెల్‌బోర్న్‌ బాక్సింగ్ డే టెస్ట్ లో ఒక స్థాయిలో మంచి స్థితిలో ఉన్న జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయింది. దీంతో జట్టు సభ్యులపై గంభీర్ ఆగ్రహం వ్యక్త చేసినట్లు తెలిసిందే. ఇప్పటి వరకు జరిగింది చాలని అన్నట్లు తెలిసింది. అంతేకాదు.. ఆటగాళ్ల తప్పులను ఎత్తి చూపడానికి అతడు ఏమాత్రం వెనుకాడలేదని సమాచారం.

Story first published: Thursday, January 2, 2025, 9:49 [IST]
Other articles published on Jan 2, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+