Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చారిత్రక ఈడెన్‌ టెస్టు గెలవడానికి సహాయపడింది వారే.. ఎప్పటికీ ఆ జ్ఞాపకాలను మరువను: ద్రవిడ్

It helped us win 2001 Kolkata Test: Rahul Dravid credits unique factor for historic win against Australia

బెంగళూరు: టెస్టు క్రికెట్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆస్ట్రేలియాను 2001లో ఈడెన్‌గార్డెన్స్‌ టెస్టులో ఓడించి టీమిండియా చరిత్ర సృష్టించింది. వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ పోరాట పటిమకు హర్భజన్ సింగ్ హ్యాట్రిక్‌ తోడై అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసింది. సౌరవ్ గంగూలీ సారథ్యంలో చారిత్రక విజయం సాధించిన భారత్.. అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఆ విజయాన్ని మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ గుర్తుచేసుకున్నాడు.

ప్రేక్షకులే గెలిపించారు:

ప్రేక్షకులే గెలిపించారు:

కోల్‌కతా 2001-ద్రవిడ్ & లక్ష్మణ్ స్పెషల్ షోలో రాహుల్‌ ద్రవిడ్‌ మాట్లాడుతూ.. మ్యాచ్ చివరి రోజు మైదానంలోని వాతావరణాన్ని వివరించాడు. 'టెస్ట్ చివరి రోజు అది. టీ విరామం తరువాత మేము వికెట్లు తీయడానికి ప్రయత్నిస్తున్నాం. హర్భజన్ సింగ్ బౌలింగ్ చేస్తున్నాడు.. వికెట్లు పడిపోతున్నాయి. ఆ సమయంలో ప్రేక్షకుల నుండి వచ్చిన మద్దతు అద్భుతం. ఈడెన్ గార్డెన్స్‌లోని ప్రేక్షకులు 2001 కోల్‌కతా టెస్టులో విజయం సాధించడానికి మాకు సహాయపడ్డారు. ప్రతి బంతికి ప్రేక్షకుల మద్దతు, ప్రోత్సాహం అమోఘం. ఆ క్షణాలను నేను ఇప్పటికీ గుర్తుంచుకున్నా, ఎప్పటికీ ఆ జ్ఞాపకాలను మరువను' అని ద్రవిడ్‌ తెలిపాడు.

ప్రతి క్రికెటర్ తప్పక అనుభవించాలి:

ప్రతి క్రికెటర్ తప్పక అనుభవించాలి:

'నా కెరీర్ గురించి చాలా విషయాలు గుర్తులేదు కానీ.. ఆ రోజు టీ తర్వాత వాతావరణం, మైదానంలో నిండిపోయిన జనంను చూస్తే ఎంతో ఆనందం వేసింది. ఇలాంటి ఓ సందర్భంను ప్రతి క్రికెటర్ తప్పక అనుభవించాలి. డ్రెస్సింగ్ రూమ్‌లోని మధుర క్షణాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. మాజీ క్రికెటర్‌గా చెపుతున్నా.. తరువాతి తరం మేము అనుభవించిన దానికంటే ఎక్కువ అనుభవించాలని నేను కోరుకుంటున్నా' అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు.

స్టీవ్ వా సెంచరీ:

స్టీవ్ వా సెంచరీ:

2001 మార్చి 11 నుంచి 15 వ‌ర‌కు కోల్‌క‌తా ఈడెన్‌గార్డెన్స్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య రెండో టెస్టు అది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ స్టీవ్ వా (110) సెంచ‌రీకి చేయగా.. మాథ్యూ హెడెన్ (97), జ‌స్టిన్‌ లాంగ‌ర్ (58) అర్ధ‌ శ‌త‌కాలు బాద‌డంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 445 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. భార‌త స్పిన్నర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌ ఏడు వికెట్లు తీసాడు. ఇందులో హ్యాట్రిక్ ఉండ‌టం విశేషం.

ల‌క్ష్మ‌ణ్ మార‌థాన్ ఇన్నింగ్స్:

ల‌క్ష్మ‌ణ్ మార‌థాన్ ఇన్నింగ్స్:

తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్ త‌డ‌బ‌డ‌టంతో 171 ప‌రుగుల‌కే భారత్ ఆలౌటైంది. వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ (59) మిన‌హా మిగిలిన‌ వారంతా విఫ‌ల‌మ‌య్యారు. ఇక భార‌త్ ఓట‌మి దాదాపు ఖాయ‌మే అని అందరూ అనుకున్నారు. ఇక స్టీవ్ వా టీమిండియాను ఫాలోఆన్‌కు ఆహ్వానించాడు. శివ‌సుంద‌ర్ దాస్ (39), శ‌ట‌గోప‌న్ ర‌మేశ్ (30), స‌చిన్ టెండూల్క‌ర్ (10) నిరాశపరచగా.. గంగూలీ (48) పర్వాలేదనిపించాడు. వ‌న్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన ల‌క్ష్మ‌ణ్ (281) టెస్టు చ‌రిత్ర‌లో నిలిచిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు.

హ‌ర్భ‌జ‌న్ మాయ:

హ‌ర్భ‌జ‌న్ మాయ:

'ది వాల్' రాహుల్ ద్ర‌విడ్ (180)తో క‌లిసి ల‌క్ష్మ‌ణ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్ద‌రూ ఐదో వికెట్‌కు 376 ప‌రుగులు జోడించడంతో భార‌త్ రెండో ఇన్నింగ్స్‌లో 657/7 వ‌ద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ 384 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలో దిగి 212కు ఆలౌటైంది. దీంతో టీమ్ఇండియా 171 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఆరు వికెట్లతో హ‌ర్భ‌జ‌న్ మళ్లీ మాయ చేసాడు. లక్ష్మణ్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఆస్ట్రేలియా వరుస 16 టెస్ట్ విజయాలకు బ్రేక్ పడింది.

Story first published: Friday, May 15, 2020, 20:43 [IST]
Other articles published on May 15, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+