క్రికెట్ పున:ప్రారంభానికి బీసీసీఐ తొలి అడుగు అదే?!!

ముంబై: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన తర్వాత తొలిసారిగా క్రికెట్ అభిమానులకు ఓ శుభవార్త అందిన విషయం తెలిసిందే. కరేబియన్‌లో జరిగే విన్సీ ప్రీమియర్ లీగ్ (వీపీఎల్) టీ10 క్రికెట్ టోర్నమెంట్ ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యకలాపాలను పున:ప‌్రారంభించడానికి ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో క్రికెట్ పున:ప్రారంభాని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా మొదటి అడుగు వేయడానికి సిద్ధంగా ఉంది.

ఐసోలేషన్ క్యాంపునకు ఆటగాళ్లు
క్రీడా కార్యకలాపాలను పున:ప‌్రారంభించడానికి.. భారత క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందిని ఐసోలేషన్ క్యాంపుల్లో ఉంచేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తోంది. నేషనల్ క్రికెట్ అకడామీ (ఎన్సీఏ)లో ఈ క్యాంపును నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే బెంగళూరులో కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో.. ప్రస్తుతం క్యాంపును అక్కడ నిర్వహించడం సరికాదని బోర్డు వర్గాలు అంటున్నాయి. ఈ క్యాంపును ఎక్కడ నిర్వహించాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.

ప్రతి వారం కరోనా టెస్టులు
క్యాంపు ఎక్కడ నిర్వహించినా.. ఆటగాళ్లు, సహాయక సిబ్బందిని రూమూల్లో ఉంచి ఎప్పటికప్పుడు వారి పరిస్థితిని పరిశీలించే అవకాశముంది. మరోవైపు సేవలందించే ఇతర సిబ్బందిని కూడా ఐసోలేషన్ క్యాంపుల్లోనే ఉంచనున్నారు.వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానీయరట. క్యాంపులోని ఆటగాళ్లకు ప్రతి వారం కరోనా టెస్టులను నిర్వహించనున్నట్లు బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఇక సీనియర్ క్రికెటర్లకు తమ సమీపంలోని స్టేడియాలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారట. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల కోసం బీసీసీఐ ఎదురుచూస్తోంది.

ఈసీబీ సన్నాహకాలు షురూ
వచ్చేవారం నుంచి ప్లేయర్లకు ట్రైనింగ్ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సన్నాహకాలు షురూ చేసిన సంగతి తెలిసిందే. విన్సీ ప్రీమియర్ లీగ్ టీ10 క్రికెట్ టోర్నమెంట్ ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. ఆరు జట్లు పాల్గొనే వీపీఎల్‌లో ఇరు జట్లు చెరి పది ఓవర్లు ఆడుతాయి. ఈ లీగ్‌ను సెయింట్ వెన్సింట్ మరియు గ్రెనడీన్స్‌లో మే 22 నుంచి 31 వరకూ నిర్వహించనున్నారు.

మే 18 నుంచి నైపుణ్య శిక్షణ
దేశవ్యాప్త లాక్‌డౌన్ ముగిసిన అనంతరం భారత క్రికెటర్లు నైపుణ్య శిక్షణలో పాల్గొనే చాన్స్‌లు ఉన్నాయని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమల్ అన్నాడు. మే 18 నుంచి మరిన్ని సడలింపులతో కూడిన లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన నేపథ్యంలో క్రికెటర్ల ప్రాక్టీస్ ప్రారంభమవుతుందని భావిస్తున్న తరుణంలో ధూమల్ మాట్లాడుతూ... 'మే 18 తర్వాత స్కిల్ బేస్డ్ శిక్షణ మొదలయ్యే చాన్సుంది. అయితే ఆరోగ్యం విషయంలో ఎలాంటి అజాగ్రత్తలకు తావివ్వం. వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వచ్చాకే శిక్షణ కార్యక్రమాలు జోరందుకుంటాయి' అని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications