Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐఎస్ఎల్: ఫోర్లాన్‌కు టెస్టింగ్‌ టైం

ముంబై: డియాగో ఫోర్లాన్‌ అత్యంత హై ప్రొఫైల్‌ గల ఫుట్‌బాల్‌ ఆటగాడు. అంతర్జాతీయంగా ఆయన నైపుణ్య గుర్తింపునకు విషమ పరీక్ష ఎదురు కానున్నది. ఐఎస్‌ఎల్‌ 3 ఎడిషన్‌లో ముంబై సిటీ ఎఫ్‌సి జట్టు సారధిగా ఫోర్లాన్‌గా వివాదాలకతీతంగా జట్టును ముందుకు తీసుకెళ్ల్లాల్సిన గురుతర బాధ్యతలను నెరవేర్చగలడనే అందరూ ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

గత ఏడాది కోచ్‌ కం కెప్టెన్‌గా నికోలస్‌ అనెల్కా వ్యూహం వివాదాస్పదమైంది. నిగ్రహంగా వ్యవహరిస్తారని పేరున్నా కోచ్‌గా, జట్టు సారధిగా జంట బాధ్యతల నిర్వహణలోనూ, జట్టును ఐక్యంగా నిలపడంలోనూ విఫలమయ్యారు. ఫుట్‌బాల్‌ భారత్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రికి మ్యాచ్‌లో స్థానంపై మొదలైన వివాదం జట్టు సభ్యుల మధ్య అసంతృప్తి.. మొత్తం టోర్నమెంట్‌పైనే పడింది. ఛెత్రితోపాటు హైతియన్‌ వింగర్‌ సోనీ నోర్డె పట్ల నికోలస్‌ దూకుడు అసలుకే ఎసరు పెట్టింది.

ఈ నేపథ్యంలో జట్టు సారధిగా బాధ్యతలు స్వీకరించిన ఫోర్లాన్‌ ఆచితూచి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఐఎస్‌ఎల్‌ మ్యాచ్‌లు ఫాస్ట్‌గా, థిక్‌గా సాగుతాయి. మ్యాచ్‌ల మధ్య సమయం చాలా తక్కువ. నుక ఇప్పటికే వ్యూహం సిద్ధంచేశామని పేర్కొన్న ఈ ఉరుగ్వేయన్‌ ఆటగాడు.. ఐఎస్‌ఎల్‌ టోర్నీ విభిన్నమైందన్నాడు. ప్రస్తుతం ప్రతి ఆటగాడు పిచ్‌పైనే దృష్టి సారించాలని సూచించాడు.

ISL 2016: Diego Forlan's Firepower to Spur Up Mumbai City

ఇక నూతన కోచ్‌ అలెగ్జ్రాండె గౌమారేస్‌ త్వరితగతిన జట్టు సభ్యుల విశ్వాసం పొందడమే తమకు కీలకమని పేర్కొన్నాడు. 2002, 2006 ప్రపంచకప్‌లలో కోస్టారికాకు గైడ్‌గా వ్యవహరించిన అలెగ్జ్జ్రాండె.. భారత్‌లో అలవాటు లేని పరిస్థితుల్లో తన పని విధానాన్ని మార్చుకోవాల్సి వస్తున్నదన్నాడు. మ్యాచ్‌కు సిద్ధమయ్యే జట్టు సభ్యులను సరైన దశలో నడిపించడమే తన పాత్ర అని వ్యాఖ్యానించాడు. జట్టులో ప్రధాన అటాకర్లుగా ఉన్న సారధి ఫోర్లాన్‌, ఛెత్రి, నొర్డెల శక్తిసామర్థ్యాలు, బలహీనతలను పరిగణనలోకి తీసుకుంటూనే కలుపుకోవడమే తమ జట్టుకు చాలా కీలకమని అన్నాడు.

ముంబై సిటీ ఆటగాళ్లు బోయిథాంట్‌ హావోకిప్‌, జాకిచంద్‌సింగ్‌, ప్రొనాయ్‌ హల్డర్‌, సెహ్నాజ్‌సింగ్‌, ఉదాంతా సింగ్‌ వంటి మిడ్‌ ఫీల్డర్లు, మ్యాచ్‌లో దూకుడుగా ఉంటే అర్గెంటీని మాటియాస్‌ డిఫెడెరికో సహకారంతో జట్టును సెమీ ఫైనల్స్‌కు తీసుకెళ్లడమే తన ప్రాథమిక లక్ష్యమని పేర్కొన్నాడు. దుబాయిలో ప్రీ సీజన్‌ శిక్షణలో తన ఆలోచనలను ఆటగాళ్లందరితోనూ పంచుకున్నానని,ఈ విషయమై అందరికీ స్పష్టత ఉందన్నాడు.

నార్త్‌ఈస్ట్‌ ప్రిన్సిపల్‌ స్పాన్సర్‌ 'హెచ్‌టిసి'

ఐఎస్‌ఎల్‌ మూడో ఎడిషన్‌లో నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సి క్లబ్‌ తన ప్రిన్సిపల్‌ స్పాన్సర్‌గా హెచ్‌టిసిని నియమించుకున్నది. ఫ్రాంచైసీ యజమాని జాన్‌ అబ్రహం ఈ సందర్భంగా మాట్లాడుతూ తాజా సీజన్‌లోనూ తమ స్పాన్సర్‌గా కొనసాగాలని హెచ్‌టిసి యాజమాన్యం నిర్ణయించుకోవడం 'నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సి' క్లబ్‌ పట్ల వారి నమ్మకాన్ని తెలియజేస్తుందని, తనకు ఎంతో గొప్పగా ఉన్నదన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+