Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇషాంత్ పై పాంటింగ్ ప్రశంసలు

Ponting
న్యూఢిల్లీ: భారత్ స్పీడ్ బౌలర్ ఇషాంత్ శర్మపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసలతో ముంచెత్తారు. టెస్టు క్రికెట్ లో తాను ఎదుర్కున్న అత్యుత్తమ బౌలింగులో ఇషాంత్ శర్మ బౌలింగ్ ఒకటని ఆయన అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ప్రతి ఒక్కరు ఇషాంత్ శర్మ గురించి మాట్లాడారని, వివిధ సందర్భాల్లోనూ ఇషాంత్ బాగా బౌలింగ్ చేశాడని, పెర్త్ లో చివరి రోజు తనకు చేసిన బౌలింగ్ తాను ఎదుర్కున్న బౌలింగులో అత్యుత్తమమైందని ఆయన వివరించారు.

భవిష్యత్తులో ఇషాంత్ శర్మతో పాటు ఇతర యువ భారత బౌలర్లు ఎలా ఎదుగుతారనేది ఆసక్తికరమైన విషయమని ఆయన అన్నారు. ఇషాంత్ కు ఎంతో భవిష్యత్తు ఉందని, భారత్ యువ క్రీడాకారులను ఎల్లప్పుడూ తయారు చేస్తుందని తాను ఎప్పుడూ చెబుతూ ఉంటానని ఆయన అన్నారు. ఎన్ డిటివీ చానెల్ కు కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. భారత ఆస్ట్రేలియా పర్యటనలో తనను, తన నాయకత్వాన్ని తప్పు పట్టేలా చూపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివాదాల్లో తాను పాలు పంచుకోనప్పటికీ తనపై తన గురించి ఎంతో మాట్లాడారని ఆయన అన్నారు. మైదానం వెలుపలి సంఘటనల ప్రభావం ఆస్ట్రేలియా జట్టు ఆటతీరుపై పడిందనేది నిజం కాదని ఆయన స్పష్టం చేశారు.
Story first published: Wednesday, March 5, 2008, 15:51 [IST]
Other articles published on Mar 5, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+