For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final 2021:అదే న్యూజిలాండ్‌కు ప్లస్‌.. భారత్‌కు మైనస్‌!ప్రపంచకప్‌ ఫైనల్‌తో డబ్ల్యూటీసీ సమానం!

Ishant Sharma says Team India feel WTC Final as Big as World Cup Final

లండన్: జూన్ 18 నుంచి సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. నెట్‌ సెషన్స్‌ తర్వాత ఆటగాళ్లు బృందాలుగా ఏర్పడి ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఇంగ్లాండ్‌ పరిస్థితులకు అలవాటు పడేందుకు బౌలర్లు వైవిధ్యంగా బంతులేస్తుండగా.. బ్యాట్స్‌మెన్‌ దీటుగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఏజీస్‌ బౌల్‌ స్టేడియానికి పక్కనున్న గ్రౌండ్‌లో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ శుక్రవారం నిర్వహించారు. తాజాగా బీసీసీఐ టీవీతో మాట్లాడిన టీమిండియా బౌలర్లు ఛాంపియన్‌షిప్‌పై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

అదే న్యూజిలాండ్‌కు ప్లస్‌:

అదే న్యూజిలాండ్‌కు ప్లస్‌:

బీసీసీఐ టీవీతో టీమిండియా వెటరన్ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మాట్లాడుతూ... 'ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ కచ్చితమైన ప్రణాళికతో పాటు కలిసికట్టుగా బరిలోకి దిగుతుంది. దానికంటే ముందు ఇంగ్లండ్‌తో రెండు టెస్టులు ఆడటం కూడా ఆ జట్టుకు కలిసివస్తుంది. ఇప్పటికే ఇంగ్లీష్ పరిస్థితులపై వారికి ఓ అవగాహన వచ్చిఉంటుంది. కివీస్ కండిషన్స్ దాదాపుగా సమానం. ఈ విషయంలో అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా భారత్‌ జట్టు మారి అలవాటు పడాలి. అదే టీమిండియాకు కీలకం' అని అన్నాడు.

ప్రపంచకప్‌ ఫైనల్‌తో సమానం:

ప్రపంచకప్‌ ఫైనల్‌తో సమానం:

సీనియర్ పేసర్ ఇషాంత్‌ శర్మ మాట్లాడుతూ... 'ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కష్టతరమైన ప్రయాణం. అలాగే భావోద్వేగమైంది కూడా. ఇది ఐసీసీ టోర్నమెంట్‌ అయినందున.. 50 ఓవర్ల ప్రపంచకప్‌ ఫైనల్‌తో సమానం. 2019లో వెస్టిండీస్‌తో ఈ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభమైనప్పుడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఓ మాట చెప్పాడు. 'ఇది కేవలం నెల రోజుల కష్టం కాదు. రెండేళ్లు సాగే సుదీర్ఘ ప్రయాణం' అని అన్నాడు' అని గుర్తుచేశాడు. కొవిడ్‌-19తో ఈ టోర్నీలో నియమాలు మారినప్పుడు భారత్‌ కష్టపడాల్సి వచ్చిందని లంబూ తెలిపాడు. క్లిష్ట పరిస్థితుల్లోనే ఆస్ట్రేలియాపై విజయం సాధించామని, ఆపై ఇంగ్లండ్‌తోనూ గెలుపొందామని ఇషాంత్‌ వివరించాడు.

ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది:

ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది:

ఆస్ట్రేలియా పర్యటనపై స్పందించిన మరో పేసర్ మొహ్మద్ షమీ.. తమ రెండేళ్ల కష్టానికి అదే అసలైన పరీక్ష అని, అక్కడ విజయం సాధించడం కీలకమని పేర్కొన్నాడు. అందుకోసం తాము 110 శాతం కష్టపడాల్సి వచ్చిందన్నాడు. సీనియర్లు లేకున్నా యువ ఆటగాళ్లు కంగారూలపై సిరీస్‌ గెలవడం తనకు అమితానందం కలిగించిందని చెప్పాడు. ఆటగాళ్లు నేర్చుకునేందుకు ఆ టోర్నీ ఒక ఉదాహరణ అని, ఆ గెలుపుతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని షమీ అన్నాడు. డబ్ల్యూటీసీ గెలిచేందుకే ఇక్కడికి వచ్చామని షమీ చెప్పుకొచ్చాడు.

 ముమ్మరంగా సాధన:

ముమ్మరంగా సాధన:

ఫైనల్ కోసం భారత క్రికెట్‌ జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. భారత ఆటగాళ్లకు ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ నిర్వహించారు. మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమీ బౌలింగ్‌ చేయగా.. చేటేశ్వర్ పుజారా, శుభ్‌మన్‌ గిల్‌ బ్యాటింగ్‌ చేశారు. మిగతా ఆటగాళ్లు ఫీల్డింగ్‌ చేశారు. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను పర్యవేక్షించాడు. మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్‌ చేసింది.

Story first published: Saturday, June 12, 2021, 10:16 [IST]
Other articles published on Jun 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+