ఇది మరీ తమాషా.. విమర్శకులపై లంబూ అసహనం

హామిల్టన్‌: టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా పేలవ ప్రదర్శనపై వస్తున్న విమర్శలను స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ తప్పుబట్టాడు. ఒకట్రెండు మ్యాచ్‌లు విఫలమైనంత మాత్రాన బుమ్రా అద్భుత ప్రదర్శనలను పక్కనపెట్టి విమర్శించడం తమాషాగా అనిపిస్తోందన్నాడు.

కేవలం ఒక్క ఇన్నింగ్స్‌..

కేవలం ఒక్క ఇన్నింగ్స్‌..

న్యూజిలాండ్‌తో తొలి టెస్టు రెండోరోజు ఆట ముగిసిన తర్వాత అతను మీడియాతో మాట్లాడుతూ బుమ్రాకు అండగా నిలిచాడు.

'ఒక ఇన్నింగ్స్‌కే జనాల అభిప్రాయాలు మారుతుంటే తమాషాగా అనిపిస్తోంది. రెండేళ్లుగా నేను, బుమ్రా, షమీ, అశ్విన్, జడేజా కలిసి 20 వికెట్లు తీస్తూనే ఉన్నాం. కేవలం ఒక్క ఇన్నింగ్స్‌ ఆధారంగా బుమ్రా సామర్థ్యాన్ని ఎలా ప్రశ్నిస్తారు? బుమ్రా సామర్థ్యాన్ని ఎవరైనా ప్రశ్నిస్తారని నేను అనుకోను. అరంగేట్రం నుంచి అతడెంత సాధించాడో మీ అందరికీ తెలుసు' అని ఇషాంత్‌ చెప్పుకొచ్చాడు.

న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్: ఇషాంత్ శర్మ అరుదైన రికార్డు

షమీ సైతం..

షమీ సైతం..

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో వికెట్లు తీయనప్పుడు షమీ కూడా బుమ్రాకు అండగా నిలిచిన విషయం తెలిసిందే తెలిసిందే.

‘చాలా మ్యాచుల్లో బాగా ఆడకపోతే అతన్ని విమర్శిస్తున్నారంటే దానికో అర్థం ఉంటుంది. కానీ ఓ మూడు మ్యాచుల్లో వికెట్లు తీయనంత మాత్రాన మ్యాచులను గెలిపించే బుమ్రా సత్తాను, అందించిన విజయాలను ఎలా మర్చిపోతారు. ఒక్క సిరీస్ వైఫల్యంతో అతడు సాధించింది అంతా పక్కన పెట్టేస్తారా? మీరు సానుకూలంగా ఆలోచిస్తే ఆ ఆటగాడికి మంచిది. అది అతడిలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. గాయం నుంచి కోలుకొని వెంటనే రాణించడం కష్టమని ఒక క్రీడాకారుడిగా నాకు తెలుసు. వ్యాఖ్యానాలు చేస్తూ డబ్బులు సంపాదించేవారికి విమర్శించడం సులభం. ఆటగాళ్లకు గాయాలు సహజం. 2015లో నేనూ గాయపడ్డాను. ఆ తర్వాత పుంజుకున్నాను' అని షమీ విమర్శకులపై ఫైర్ అయ్యాడు.

బుమ్రా అద్భుతమైన బౌలర్..

బుమ్రా అద్భుతమైన బౌలర్..

న్యూజిలాండ్‌ సీనియర్‌ పేసర్‌ టిమ్‌ సౌతీ సైతం బుమ్రాకు మద్దతుగా మాట్లాడాడు. 'బుమ్రా అద్భుతమైన బౌలర్‌. అతడి బౌలింగ్‌లో ఎలాంటి తప్పు లేదు. అతడు గాయం నుంచి కోలుకొని తిరిగొచ్చాడు. నాణ్యమైన అలాంటి పేసర్‌ గొప్ప ప్రదర్శనలు చేయకుండా ఎక్కువకాలం ఉండడు. వన్డే సిరీసులో మేం అతడికి వికెట్లు ఇవ్వలేదు. సుదీర్ఘ ఫార్మాట్లోనూ అలాగే ఆడాలని అనుకుంటున్నాం. కానీ అత్యుత్తమంగా రాణించేందుకు అతడు మనకు తెలియకుండా ఎంతో కఠినంగా శ్రమిస్తున్నాడని నేను కచ్చితంగా చెప్పగలను. కొన్నిసార్లు ఎంత బాగా బౌలింగ్‌ చేసినా వికెట్లు దొరకవు' అని సౌతీ తెలిపాడు.

పోరాడుతున్న భారత్..

పోరాడుతున్న భారత్..

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 348 పరుగులకు ఆలౌట్ చేసిన కోహ్లీసేన.. రెండో ఇన్నింగ్స్‌‌లో మరోసారి తడబడింది. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి టాపార్డర్ చేతులెత్తేయడంతో 113 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఓపెనర్ పృథ్వీషా(14), ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా(11), కెప్టెన్ విరాట్ కోహ్లీ(19) మరోసారి దారుణంగా విఫలమవ్వగా... మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(58) పర్వాలేదనిపించాడు. దీంతో 53 ఓవర్లకు భారత్ 4 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. క్రీజులో రహానే (13 బ్యాటింగ్), విహారీ (9 బ్యాటింగ్) ఉన్నారు.

ఇక అంతకముందు ఓవర్‌నైట్‌ స్కోర్‌ 216/5తో మూడో రోజు ఆటను ప్రారంభించిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 100.2 ఓవర్లలో 348 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో విలియమ్సన్(89), రాస్ టేలర్(44), కైలీ జేమీసన్(44) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ(5/65) ఐదు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించగా.. రవిచంద్రన్ అశ్విన్ (3/99) మూడు వికెట్లు, బుమ్రా(1/88), మహ్మద్ షమీ (1/91) చెరొక వికెట్ తీశారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Sunday, February 23, 2020, 11:44 [IST]
Other articles published on Feb 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X