'నాకు ఆడాలని మాత్రమే ఉంది.. ఏ జట్టుకైనా ఆడతా'

కోల్‌కతా: నాకు ఆడాలని మాత్రమే ఉంది. అది రంజీ ట్రోఫీ అయినా, భారత జట్టుకైనా.. ఎక్కడైనా ఆడుతా. ఆటను ఆస్వాదిస్తే మన ప్రదర్శన బాగుంటుంది అని టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. చారిత్రక డే/నైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ.. అదే జోరు రెండో ఇన్నింగ్స్‌లో ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.

నాకు ఆడాలని మాత్రమే ఉంది
మ్యాచ్ అనంతరం ఇషాంత్ మీడియాతో మాట్లాడుతూ... 'జీవితంలో ఒక దశకు చేరుకున్నా. ఏ ఫార్మాట్‌లో ఆడుతున్నాననే విషయం గురించి ఆందోళన చెందడం ఎప్పుడో మానేశా. నాకిప్పుడు 31 ఏళ్లు. ఎక్కడ ఆడుతున్నాననే విషయాన్ని పట్టించుకుంటే ఉత్తమ ప్రదర్శన చేయలేను. నాకు ఆడాలని మాత్రమే ఉంది. అది రంజీ ట్రోఫీ అయినా, భారత జట్టుకైనా ఆడుతా. ఆటను ఆస్వాదిస్తే మన ప్రదర్శన బాగుంటుంది. చిన్న విషయాలను పట్టించుకుంటే ఎప్పటికీ మెరుగవ్వలేము' అని అన్నాడు.

రిజర్వ్ బెంచ్‌లో ఉండటం కష్టం
'జట్టులోకి కొత్త కుర్రాళ్ళు వస్తున్నారు. అందరూ నిరూపించుకున్తున్నారు. ప్రస్తుతం జట్టులో ఆరోగ్యకరమైన పోటీ ఉంది. అది మా ప్రదర్శనలను మెరుగుపరుస్తుంది. జట్టులో మన స్థానం సుస్థిరమైనప్పుడు, సహచరుల నుంచి సవాళ్లు ఎదురుకానప్పుడు.. మంచి ప్రదర్శన చేయలేము. అలాంటప్పుడు రిజర్వ్ బెంచ్‌లోనూ ఉండటం కష్టం' అని ఇషాంత్ పేర్కొన్నాడు.

అంతలా ఆలోచించట్లేదు
'ప్రస్తుతం నా ఆటను ఆస్వాదిస్తున్నా. ఇదివరకు నా ప్రదర్శనల పట్ల చాలా ఒత్తిడికి గురయ్యేవాడిని. అప్పుడు అనేక విషయాలు నా మెదడులో మెలిగేవి. ఇప్పుడు అంతలా ఆలోచించట్లేదు. వికెట్లు ఎలా తీయాలనేదానిపైనే ఇప్పుడు నా ధ్యాసంతా నెలకొంది' అని ఇషాంత్ తెలిపాడు. 2007లో పాకిస్థాన్‌పై అరంగేట్ర టెస్టులోనే ఇషాంత్ ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. ఇన్నాళ్లకు మళ్లీ సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications