
హైదరాబాద్: టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కౌంటీల్లో ఆడుతోన్న సంగతి తెలిసిందే. ససెక్స్ జట్టుకు ఆడుతున్న ఇషాంత్.. భుజానికి గాయం కావడంతో మిడిలెసెక్స్ జట్టుతో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాస్త విరామం లభించడంతో ఇషాంత్ శర్మ విశ్రాంతి తీసుకుంటున్నాడు.
అనుకోకుండా వచ్చిన ఈ విరామాన్ని లంబూ తన భార్య ప్రతిమతో కలిసి ఆస్వాదిస్తున్నాడు. బ్రిగ్టన్ టౌన్‌లో ఒక చోట సేద తీరుతుండగా.. లంబూకు ప్రతిమ ముద్దిచ్చి తన ప్రేమను వ్యక్తం చేసింది. ఈ ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'ఇది పారిస్ కాదు. ఇది బ్రిగ్టన్. లవ్' అని క్యాప్షన్ పెట్టింది.