Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆప్ఘన్‌తో ఏకైక టెస్టు: మరో భారత క్రికెటర్ దూరం?

 Ishant Sharmas participation in one-off Afghanistan Test under scanner after being injured in County game

హైదరాబాద్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కి మరో భారత క్రికెట్ దూరం కానున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాడ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న పేసర్ బౌలర్ ఇశాంత్ శర్మ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కి దూరం కానున్నట్లు సమాచారం.

మే నెలలో గ్లోసెస్టర్‌షైర్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇశాంత్ శర్మ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. తాజాగా ఇషాంత్ శర్మ మరోసారి గాయపడ్డాడు. దీంతో ప్రస్తుతం ఇశాంత్ శర్మ జూన్ 3న జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. కౌంటీ క్రికెట్‌లో మొత్తం నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఇశాంత్‌ 23 యావరేజ్‌తో 15 వికెట్లు తీశాడు.

దీంతో పాటు లిస్ట్ ఏ టోర్నమెంట్‌లో భాగంగా రాయల్ లండన్ వన్డే కప్‌లో ఆరు మ్యాచులాడిన ఇశాంత్ శర్మ 4.81 ఎకానమీతో 8 వికెట్లు తీశాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఇషాంత్ శర్మకు ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అతడు అర్హత సాధిస్తే. ఆ తర్వాత యో-యో టెస్ట్ నిర్వహిస్తారు.

యో-యో టెస్టులో పాసైతే ఇషాంత్ శర్మకు ఆప్ఘన్‌తో జరిగే ఏకైక టెస్టు జట్టులో చోటు కల్పిస్తారు. అలా కాని పక్షంలో అతడి స్థానంలో మరో పేసర్‌ని జట్టులోకి తీసుకోనే అవకాశం ఉంది.

Story first published: Tuesday, June 5, 2018, 8:20 [IST]
Other articles published on Jun 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+