Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇశాంత్ శర్మకు చికెన్ గున్యా.. 500వ టెస్టుకు దూరం!

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా డెంగీ, చికెన్ గున్యా లాంటి విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. తాజాగా టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ కూడా చికెన్ గున్యా బారిన పడ్డాడు. ఇశాంత్ కు చికెన్ గున్యా సోకినట్టు టీమ్ ఇండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే వెల్లడించారు.

ప్రస్తుతం ఇశాంత్ చికెన్ గున్యా బాధపడుతుండడంతో.. ఈ నెల 22న న్యూజిలాండ్ జట్టుతో జరగబోయే టీమ్ ఇండియా 500వ టెస్ట్ కు ఇశాంత్ ఆడడం దాదాపుగా అసాధ్యమే. ఇదే విషయంపై మీడియాతో మాట్లాడిన కుంబ్లే.. ఇశాంత్ చికెన్ గున్యా బారిన పడడంతో అతని స్థానంలో ఎవరిని తీసుకోవాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

Ishant Sharma ruled out of first Test due to Chikungunya

ప్రస్తుత జట్టులో మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్‌లతో కూడిన పేస్ బౌలర్లు మాత్రం అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఇండియా తరుపున వరుసగా మ్యాచ్ లు ఆడుతూ వస్తున్న ఇశాంత్ ఇప్పటిదాకా 72 మ్యాచ్ లు ఆడాడు. ఇటీవలి విండీస్ టూర్ లోను 32.12 సగటుతో 8 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+