
హైదరాబాద్: శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరిస్‌కు ఎంపికైన టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మను రంజీల్లో ఆడేందుకు పంపించారు. శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌కు బీసీసీఐ ఎంపిక చేసిన 15 మంది ప్రాబబుల్స్ జాబితాలో ఇషాంత్ ఎంపికయ్యాడు.
అయితే కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టుకు తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. పేసర్లకు అనుకూలించే పిచ్ కావడంతో భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీకి మేనేజ్‌మెంట్ ఆడే అవకాశం కల్పించింది. ఇషాంత్ తుది జట్టులో లేకపోవడంతో టీమ్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
రంజీల్లో మహారాష్ట్రతో ఢిల్లీ జట్టు కీలకమ్యాచ్‌లు ఆడుతుండటంతో రంజీ మ్యాచ్ ఆడేందుకు వీలుగా బీసీసీఐ అతణ్ని జట్టు నుంచి రిలీజ్ చేసింది. శుక్రవారం మహారాష్ట్రతో ఆరంభమయ్యే మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఢిల్లీని ముందుకు నడిపించిన ఇషాంత్.. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 15 వికెట్లు తీశాడు.
శ్రీలంక టెస్టు సిరిస్‌ను దృష్టిలో పెట్టుకుని పేసర్లు విశ్రాంతి తీసుకోవాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేయడంతో ఇటీవల అలూర్‌లో కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో ఇషాంత్ ఆడలేదు. 20 ఏళ్ల వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ 17 పాయింట్లతో ప్రస్తుతం గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉంది.
నవంబర్ 24న నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్టు నాటికి ఇషాంత్ శర్మ తిరిగి భారత జట్టులో చేరతాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.