Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కౌంటీల్లో ఇషాంత్ శర్మ అద్భుత ప్రదర్శన (వీడియో)

Ishant Sharma picks up five wickets on County debut for Sussex

హైదరాబాద్: భారత క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో సత్తా చాటిన బౌలర్లలో ఇషాంత్ శర్మ ఒకడు. అతి తక్కువ కాలంలో ఫాస్ట్ బౌలర్‌గా పేరు తెచ్చుకున్న ఇషాంత్ శర్మ ఆ తర్వాతి కాలంలో తన ఫా‌మ్‌ని కొనసాగించలేకపోయాడు. తద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమయ్యాడు.

ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో స్పెషలిస్ట్ బౌలర్‌గా ముద్ర వేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది జనవరిలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో కూడా ఇషాంత్ శర్మను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ కూడా ఆసక్తిని కనబర్చలేదు. దీంతో అతనికి ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడే అవకాశం వచ్చింది.

 రెండు నెలల పాటు ఆడేందుకు ఒప్పందం

రెండు నెలల పాటు ఆడేందుకు ఒప్పందం

ఇందులో భాగంగా ససెక్స్ జట్టు తరఫున దాదాపు రెండు నెలల పాటు ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ అవకాశాన్ని అతను బాగానే సద్వినియోగం చేసుకుంటున్నాడు. స్పేస్‌సేవర్స్‌ కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ జట్టు తరఫున ఆడుతున్న ఇషాంత్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేశాడు.

29.2 ఓవర్లు వేసి 69 పరుగులు ఇచ్చి 5 వికెట్లు

29.2 ఓవర్లు వేసి 69 పరుగులు ఇచ్చి 5 వికెట్లు

కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్-2లో భాగంగా ససెక్స్-వార్విక్‌షైర్‌ జట్ల మధ్య నాలుగురోజులపాటు జరిగిన ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో 29.2 ఓవర్లు వేసిన ఇషాంత్ శర్మ 69 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో విల్ రోడ్స్, ఆడమ్ హోస్, టిమ్ ఆంబ్రోస్‌ల వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఇయాన్ బెల్, జొనాథన్ ట్రోట్‌ల వికెట్లు పడగొట్టి అదుర్స్ అనిపించాడు.

ఇషాంత్ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ డ్రా

ఇషాంత్ అద్భుత ప్రదర్శనతో ససెక్స్‌ జట్టు మ్యాచ్‌లో పైచేయి సాధించింది. వార్‌విక్‌షైర్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించే సమయానికి మ్యాచ్‌లో ఫలితం వచ్చే అవకాశం లేకపోయింది. దీంతో ఇరుజట్లు మ్యాచ్‌ను డ్రాగా ముగించాయి. ఇషాంత్ ఐదు వికెట్లు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 ఐపీఎల్ తర్వాత విరాట్ కోహ్లీ సైతం కౌంటీల్లో

ఐపీఎల్ తర్వాత విరాట్ కోహ్లీ సైతం కౌంటీల్లో

ఇక, ఏప్రిల్ 20న ససెక్స్ జట్టు తన తదుపరి మ్యాచ్‌ను లీసెస్టర్‌షైర్‌ జట్టుతో ఆడనుంది. త్వరలో టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఇషాంత్ శర్మ కౌంటీల్లో రాణించడం శుభపరిణామం. మరోవైపు టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ కూడా ఇంగ్లాండ్ పర్యటనకు ముందు, ఐపీఎల్ ముగిసిన తర్వాత కౌంటీలో సర్రే జట్టు తరఫున ఆడనున్నాడు.

Story first published: Wednesday, April 18, 2018, 18:17 [IST]
Other articles published on Apr 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+