
హైదరాబాద్: భారత జట్టు సీనియర్ పేసర్ అయినటువంటి ఇషాంత్ శర్మకు ఆవేశంలో ఆలోచన పని టీమిండియాలో అనుభవజ్ఞుడైన పేసర్ ఇషాంత్ శర్మ చాలా ఉద్రేకపరుడని అందుకే జట్టు పేస్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహించడంలో విఫలమవుతాడని మాజీ పేసర్ రాజు కుల్‌కర్ణి అన్నారు.
'అతడు (ఇషాంత్) 78 టెస్టులు ఆడాడు. అన్ని మ్యాచ్‌లు ఆడటమంటే అద్భుతమే. అయితే, జట్టు బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించినట్టు నాకెప్పుడూ అనిపించలేదు. అదే సమస్య. అతడు చాలా ఉద్రేకపరుడు. ప్రతిసారీ కొత్త కొత్త టెక్నిక్‌లు, ప్రణాళికలతో వస్తాడు. కానీ, అమలు చేయడంలో మాత్రం తికమకపడతాడు. గత రెండు సిరీసుల్లోనూ అతడి ప్రవర్తన తీరు సరిగా లేదు. ప్రతి సందర్భానికి అసహ్యంగా ప్రవర్తించాడు. ప్రతిసారీ విభిన్నంగా ప్రయత్నించాలని నిలకడ కోల్పోతాడు' అని కుల్‌కర్ణి విమర్శించాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ,,ప్రస్తుత భారత బౌలింగ్ విభాగం చాలా బాగుందని కుల్‌కర్ణి ప్రశంసించారు. 'ప్రస్తుత పేస్ బౌలింగ్ దళం అద్భుతంగా ఉంది. మనకిప్పుడు ఎక్కువ బౌలింగ్ వనరులు, ప్రతిభావంతులు ఉన్నారు. నాకు సమస్యగా అనిపిస్తుందల్లా వారి ఫిట్‌నెస్. నిరంతరం ఆడలేకపోతున్నారు. వరుసగా మూడు, నాలుగు మ్యాచ్‌లు ఆడితే చాలు ఆ తర్వాత మరో మ్యాచ్ ఆడలేకపోతున్నారు. దీని గురించి ఆలోచించాలి. ఇక దక్షిణాఫ్రికాపై తొలి మ్యాచ్‌లో ఓటమి సంగతి పక్కన పెడితే భువి సహా మిగతా బౌలర్లు తమ సత్తా ఏంటో చూపించారు. అలాంటి పిచ్‌లు దొరికొతే ఎలాంటి జట్టునైనా కుప్పకూల్చేయగలమని నిరూపించారు. రెండో ఇన్నింగ్స్‌లో అయితే మరిచిపోలేని బౌలింగ్ చేశారు' అని కుల్‌కర్ణి అన్నారు.
భారత క్రికెట్ క్లబ్ వద్ద లెజెండ్స్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో రాజు కుల్‌కర్ణి మాట్లాడారు. బంగ్లాదేశ్‌పై 2007లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఇషాంత్ 79 మ్యాచుల్లో 226 వికెట్లు తీశాడు. 80 వన్డేల్లో 115 వికెట్లు పడగొట్టాడు.