Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా జర్నలిస్ట్‌కు కౌంటర్ ఇచ్చిన ఇషాంత్ శర్మ

Ishant Sharma gives a funny reply to an Australian journalist

సిడ్నీ: మరోసారి భారత జట్టు బాధ్యతను భుజానకేసుకునేందుకు సిద్ధమైయ్యాడు టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ. అతను జట్టులో ఉన్నాడంటే భారీ స్థాయిలో అంచనాలు పెట్టేసుకుంటారు. గతంలో జరిగిన ఇంగ్లాండ్ పర్యటనలోనూ అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా ఇషాంత్ పేరిట రికార్డులున్నాయి. ఇప్పటికీ పెర్త్ వేదికగా 2008లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 72పరుగుల తేడాతో గెలుపొందని టెస్టు మ్యాచ్‌లో ఇషాంత్ బౌలింగే కీలకం.

ఇషాంత్‌ను అడిగిన ప్రశ్నకు సరైన కౌంటర్

ఇషాంత్‌ను అడిగిన ప్రశ్నకు సరైన కౌంటర్

అప్పట్లో ఇషాంత్ 2011-12, 2014-15రెండు సీజన్లలో పది మ్యాచ్‌లు ఆడి 20వికెట్లు తీశాడు. డిసెంబర్ 6 నుంచి జరగనున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఈ తరుణంలో ఆస్ట్రేలియా మీడియా ఇషాంత్‌ను అడిగిన ప్రశ్నకు సరైన కౌంటర్ ఇవ్వడంతో స్థానిక జర్నలిస్టు తన ప్రశ్నను తానే సవరించుకున్నాడు.

పదకొండేళ్ల నుంచి వస్తున్నా.. కానీ, యేటా కాదు

పదకొండేళ్ల నుంచి వస్తున్నా.. కానీ, యేటా కాదు

ప్రశ్నల పరంపర కొనసాగుతున్న తరుణంలో ఇషాంత్‌ను.. 'నాకు తెలిసి పదకొండేళ్ల నుంచి ఆస్ట్రేలియా పర్యటనకు వస్తున్నట్లున్నావ్. అవును కదా' అని ఇషాంత్‌ను ప్రశ్నించాడు. దానికి స్పందించిన ఇషాంత్ 'అవును. పదకొండేళ్ల నుంచి వస్తున్నా.. కానీ, ప్రతి సంవత్సరం కాదు. అని బదులిచ్చాడు. తన తప్పును తెలుసుకున్న ఆస్ట్రేలియన్ దానిని సవరించుకుంటూ 'తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చి పదకొండేళ్ల అయింది కదా' అని సర్ది చెప్పుకున్నాడు.

ప్రధానంగా మ్యాచ్ గెలవాలని ఆశిస్తున్నాం

ప్రధానంగా మ్యాచ్ గెలవాలని ఆశిస్తున్నాం

'మేము ప్రధానంగా మ్యాచ్ గెలవాలని ఆశిస్తున్నాం. ఈ పర్యటన మొత్తంలో వ్యక్తిగత ప్రదర్శనను పట్టించుకోం. జట్టుగా గెలిచేందుకే కష్టపడతాం. ఎలాగైనా టెస్టు సిరీస్ గెలిచి తీరుతాం. దీనిపైనే అందరి దృష్టి కేంద్రీకరించి ఉన్నాం.' అని తెలిపాడు. ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు పూనుకున్న టీమిండియాకు.. తొలి రోజు వర్షం కారణంగా ఆట రద్దు అయింది. రెండో రోజు ఆటలో భాగంగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది.

1947 నుంచి విజయం సాధించలేకపోయింది

1947 నుంచి విజయం సాధించలేకపోయింది

1947-48 నుంచి ఆస్ట్రేలియా పర్యటన చేస్తున్న టీమిండియా ఇప్పటి వరకూ టెస్టు సిరీస్‌లో విజయం సాధించలేకపోయింది. కాగా, భారత్ 1980-81, 1985-86, 2003-04లలో మాత్రమే చక్కటి ఫలితాలను రాబట్టగలిగింది. కాగా, తొలి ఫార్మాట్‌లో భాగంగా జరిగిన టీ20లో 1-1తో సమం చేసింది.

Story first published: Thursday, November 29, 2018, 15:29 [IST]
Other articles published on Nov 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+