ఒక ఓవర్‌లో 30 పరుగులు: 15 రోజులు ఏడ్చానన్న ఇషాంత్

హైదరాబాద్: క్రికెట్ మ్యాచ్‌లో తనదైన రోజున ఆటగాళ్లు సత్తా చాటుతారు. బ్యాట్స్ మెన్లు అయితే పరుగుల వరద పారిస్తారు. అదే బౌలర్ విషయానికి వస్తే కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేస్తారు. ఈ క్రమంలో వారు చేసే ప్రదర్శనలు జట్టులో తన స్థానాలను పదిలం చేయొచ్చు లేకపోతే ఆ చెత్త ప్రదర్శన ఆటగాడి జీవితాన్ని మార్చేయొచ్చు.
టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ కెరీర్‌ను కూడా ఓ చెత్త ప్రదర్శన కోలుకోలేని దెబ్బతీసింది. 2013లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఒకే ఓవర్లో ఇషాంత్ 30 పరుగులిచ్చి ఆ మ్యాచ్‌లో భారత్ ఓటమికి కారణమయ్యాడు. దీంతో ఆ బాధను తట్టుకోలేక ఇషాంత్ శర్మ 15 రోజులపాటు ఏడ్చాడంట.
ఈ విషయాన్ని ఇషాంతే స్వయంగా వెల్లడించాడు. "క్రికెట్ కోసం నేను ఎప్పుడూ కష్టపడతూనే ఉన్నాను. అయితే, నా కారణంగానే ఆ మ్యాచ్‌లో ఓడిపోయాం. దీంతో నేను కేవలం ఒక్కరోజే ఏడవలేదు. సుమారు 15 రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నాను" అని ఇషాంత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మూడో వన్డేలో 303 పరుగులు చేసిన భారత్
ఏడు వన్డేల సిరీస్‌లో అప్పటికే 1-1తో రెండు జట్లు సమంగా నిలిచాయి. మూడో వన్డేలో భారత్ 303 పరుగులు చేసింది. కంగారూల విజయానికి 18 బంతుల్లో 44 పరుగులు అవసరం. కానీ ఇషాంత్ వేసిన 48వ ఓవర్‌లో జేమ్స్ ఫాల్కనర్ 30 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఆసీస్ సునాయాసంగా గెలుపొందింది.

భార్య ప్రతిమా సింగ్ ఇలా
ఇషాంత్ ఆ బాధ నుంచి బయటకు రావడానికి భార్య ప్రతిమా సింగ్, అతడి ఫ్రెండ్ రాజివ్ మహాజన్ ఎంతగానో ప్రయత్నించారు. ఈ విషయాన్ని లంబూ భార్య ప్రతిమా సింగ్ వెల్లడించారు. ఈ సంఘటనపై ప్రతిమా సింగ్ మాట్లాడుతూ "ఇషాంత్ అంతలా ఏడవడటం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. క్రికెటే జీవితం కాదు. అంతకు మించి జీవితం ఎంతో పెద్దది, క్రికెట్‌కు అంత ప్రాధాన్యం ఇవ్వొద్దని ఊరడించే ప్రయత్నం చేశా" అని ఆమె అన్నారు.

ఫల్కనర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
ఈ మ్యాచ్‌లో 29 బంతుల్లో 64 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన ఫల్కనర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు రద్దు కాగా.. భారత్ 3-2తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. చివరి వన్డేలో రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో చెలరేగడంతో భారత్ విజయం సాధించింది.

ఒకే ఓవర్లో 30 పరుగులిచ్చిన ఇషాంత్
ఒకే ఓవర్లో 30 పరుగులు ఇచ్చినందుకుగాను మూడో వన్డే తర్వాత ఇషాంత్‌పై వేటుపడింది. అంతేకాదు ఈ చెత్త ప్రదర్శన ఇషాంత్ వన్డే కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. మొహాలీ వన్డే తర్వాత ఇషాంత్ కేవలం 12 వన్డేలు మాత్రమే ఆడాడు. 2016లో భారత్ తరుపున తన చివరి వన్డేని ఆడిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications