Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నెహ్రా, ఇషాంత్ లతో భర్తీ: జహీర్

Zaheer Khan
న్యూఢిల్లీ: ఛాంపియన్స్ ట్రోఫీలో తాను లేని లోటును ఆశిష్ నెహ్రా, ఇషాంత్ శర్మ భర్తీ చేస్తారని భారత ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ అన్నారు. భుజం గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి జహీర్ దూరమవుతున్న విషయం తెలిసిందే. బౌలింగ్ యూనిట్లో ఆరోగ్యకరమైన పోటీ ఉందని, ఎవరు ఆడినా బాధ్యతను తీసుకుంటారని, భారత్ టోర్నమెంట్ గెలుస్తుందని జహీర్ అన్నారు.

ఇషాంత్ కొంత కాలంగా బాగా ఆడుతున్నాడని, నెహ్రా తిరిగి ఫామ్ లోకి వచ్చాడని ఆయన అన్నారు. బౌలరుగా నెహ్రా ఎన్నో గాయాల పాలయ్యాడని, సహ బౌలరుగా తాను దాన్ని అర్థం చేసుకోగలనని, నాలుగేళ్ల తర్వాత తిరిగి అతను రావడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. గాయాల పాలు కావడం జీవితో భాగమని, వాటి నుంచి పారిపోలేమని, గాయాలు కాకుండా చూసుకోవడం అవసరమని, అయితే ఒక్కసారి గాయపడిన తర్వాత సహనంతో వాటిని అదుపులోకి తీసుకు రావాలని ఆయన అన్నారు.

తాను వెనకబడి పోవడం ఏమీ ఉండదని, ఫిట్నెస్ కోసం ప్రయత్నించడానికి తనకు సమయం చిక్కుతుందని, సాధ్యమైనంత త్వరగా తిరిగి వస్తానని, అదే సమయంలో తన జట్టు వెనకబడి పోకూడదని ఆయన అన్నారు. తన గాయం గురించి తాను ఎప్పటికప్పుడు బిసిసిఐకి తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+